సర్కార్ ఆసుపత్రులకు అత్యవసర వాహనాలు

ambulance

హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి పేరుగాంచి న ఆసుపత్రులకు అత్యవసర వాహనాలు సమకూర్చుందుకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళికలు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉ న్న ఆసుపత్రులకు అందించేందు కు ఏర్పాట్లు చేయగా, నగర ఆసుపత్రుల్లో కూడా అంబులెన్స్‌ల కొరత ఉందని, ఉన్న వాహనాలు కూడా స క్రమంగా నడవడంలేదని ఆసుపత్రి ఉన్నతాధికారులు గత ఆరునెలల క్రితమే ఉన్నతాధికారులను కొత్త వాహనాలు ఏర్పాటు చేయాలని కో రడంతో వారు వీలైనంత త్వరగా కొనుగోలు చేసి అందజేస్తామని పే ర్కొన్నారు. గత మూడునెలనుంచి నగరంలో సీజనల్ వ్యాధులతో ఆసుపత్రులు రోగాలతో నిండిపోయారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని తీసుకరావాలంటే సరిపడ అంబులెన్స్‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గత మూడేళ్ల నుంచి ఉస్మానియాలో 6, గాంధీ ఆసుపత్రిలో 6, నీలోఫర్ 4, కోఠి మెటర్నటీ 3 సేవలందిస్తున్నాయి. వీటిలో కొన్నింటికి రిపేర్లు రావడంతో అవి కూడా మూలన పడ్డాయి. అత్యవసర వాహనాలు పెంచకపోతే రోగులు మరింత ఇబ్బందులు ప డుతున్నారని ఆసుపత్రుల ఉన్నతాధికారులు నెలరోజుల కితం ఉస్మానియా, గాం ధీ ఆసుపత్రుల సేవలను ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలను వైద్యులు వివరించి, తక్షణమే అంబులెన్స్ కావాలని సూచించడంతో ఆయన స్పందించి త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. అ ందులో భాగంగా నాలుగు ఆసుపత్రులకు 16 వాహనాలు ఇచ్చేందుకు సిద్దమైన్నట్లు తెలుస్తుంది. ఉస్మానియా ఆసుపత్రికి రోజుకు 1800లకుపైగా ఓపి పెషంట్లు వస్తుండగా, 1168పడకలు ఉన్నాయి. గాంధీలో 1500లకుపైగా ఓపి రోగులకు సేవలందింస్తుండగా పడకలు 1012, కోఠి మెటర్నటీ ఆసుపత్రి సిబ్బంది రోజుకు 800నుంచి 1100మంది బాలింతలకు చికిత్సలు అందిస్తున్నారు.

దీనిలో 160 పడకలున్నాయి. నీలోఫర్ ఆసుపత్రిలో రోజుకు 1200మంది చిన్నారులకు ఓపి ద్వారా పలు రకాలు వైద్య పరీక్షలు అందిస్తున్నారు. 650 పడకల్లో ఇన్‌పెషంట్లకు సేవలందిస్తున్నారు. ఆనాలుగు ఆసుపత్రుల్లో నవంబర్ మొదటి వారంలోగా ఉస్మానియాకు 04, గాంధీ ఆసుపత్రికి 05, నీలోఫర్ 04, మెటర్నటీ దవాఖానకు 04 అత్యవసర వాహనాలు త్వరలో ఇవ్వనున్నట్లు జిల్లా వైద్యవిభాగం అధికారులు వెల్లడిస్తున్నారు. తరువాత ఏరియా ఆసుపత్రులు, పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, 03 జిల్లా ఆసుపత్రులకు కూడా ఒక అంబులెన్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

Emergency vehicles for government hospitals

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సర్కార్ ఆసుపత్రులకు అత్యవసర వాహనాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.