పైనో పట్నం.. కిందో పట్నం

Elevador-Lacerdaఎలివేటర్ అనగానే బిల్డింగ్స్‌లో కిందనుంచి పైకి వెళ్ళడానికి ఉపయోగిస్తారు అని తెలిసిందే. అయితే ఓ ఎలివేటర్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక ఊరు నుంచి మరో ఊరుకి వెళ్లడానికి ఉపయోగిస్తారు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి? ఎక్కడుందో చూద్దాం..
బ్రెజిల్‌లోని లాసెర్డా ఎలివేటర్ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇది రెండంతస్తుల ఓ ఊరుకు వారధిగా ఉంటుంది. రెండంతస్తుల ఊరేంటీ? ఎలివేటర్ కలపడం ఏంటీ? అనుకుంటున్నారా? ఇక్కడి సాల్వడార్ అనే పట్టణం సిదాజ్ బైక్సా, సి దాజ్ అల్టా అనే రెండు పట్టణాలుగా విడిపోయి ఉంటుంది. సముద్ర తీరంలో ఉన్న కింద పట్టణం నుంచి పై పట్టణం 279 అడుగుల ఎత్తులో ఉం టుంది. రాకపోకలు ఎలా అని ఈ లిఫ్టు కట్టారు.
* బ్రెజిల్‌లో మొట్టమొదటి ఎలివేటర్ ఇదేనట. దీన్ని 1873లో నిర్మించారు. ఆ తర్వాత మార్పులు చేస్తూ వచ్చారు.
* ఇంచుమించు ఇరవై అంతస్తుల ఎత్తు ఉండే ఈ ఎలివేటర్ 30 సెకన్లలో దూసుకుపోతుంది. కాస్త సర్దుకుని నిల్చునే లోపే వేగంగా దింపేస్తుందన్నమాట.
* సముద్ర తీరం.. పరిసరాల అందాలు చూడ్డానికి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. రోజూ ఈ లిఫ్టులో 15 వేల మంది వరకు ఎక్కుతుంటారు.

Elevador Lacerda in Brazil

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పైనో పట్నం.. కిందో పట్నం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.