యథేచ్చగా పంట పొలాలకు విద్యుత్ తీగలు

 Crop Fields

 

లక్ష్మణచాంద : అన్నదాతలు వారి పంటల రక్షణ కోసం యథేచ్చగా విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో మూగజీవాలతో పాటు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పొతున్నారు. జిల్లాలో అధిక మోతాదులో ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా ఆరుగాలం కష్టపడి పండించిన వారి పంటలను రక్షించుకోవాలనే ఉద్దెశ్యంతో రాత్రి, పగలు పూటలు సైతం వారి పంటలకు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని.. కొన్ని సందర్బాల్లో ఆ కరెంట్ తీయడం మర్చిపోవడంతో అటు వైపు వెళ్లే మూగజీవాలు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పొతున్న తరుణం పై ’మన తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం….

లక్ష్మణచాంద మండలంలోని ఆయా గ్రామాల అన్నదాతలు వారి పంటల రక్షణ కోసం అక్రమంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ప్రాణాలు పోయే పరిస్థితులే నెలకొన్నాయి. బుధవారం ’మన తెలంగాణ’ వ్యవసాయ పంటలకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెలను పరిశీలించినడానికి వెళ్లినప్పుడు దాదాపుగా 90 శాతం మంది రైతులు అక్రమంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకోగా మిగితా శాతం రైతన్నలు వారి పంటల రక్షణ కోసంత సోలార్ విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. మండలంలోని బాబాపూర్ గ్రామం నుండి లక్ష్మణచాంద మండలకేంద్రానికి వెళ్లే రహాదారి(షాట్‌కట్ రోడ్డు) ని అనుకొని పంట చేనులో రైతులు యథేచ్చగా కరెంట్ కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. కాస్త రోడ్డు పక్క నుండి వెళ్లే ప్రయాణికులకు సైతం ఈ విద్యుత్ కంచె తగిలే అవకాశం అధికంగా ఉంది.

ఇటీవల మండలంలోని నర్సాపూర్(డబ్లు) గ్రామంలో పంట చేనుకు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెకు తగిలి బట్టు పండరి అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెంది ఐదు రోజులు కాగా మృతదేహాం కుల్లిపోయిన విషయం తెలిసిందే. అలాగే సారంగాపూర్ మండలంలోని ధని గ్రామంలో నిర్మల్ పట్టణంలోని కురన్నపేట్‌కు చెందిన కౌన్సిలర్ అంగ నరేష్ పేకాట ఆడుతున్న పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఒ పంట చేనులో విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందిన సంఘతి తెలిసిందే. ఇలా అనేక రకాలుగా అమాయక ప్రజలు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలకు బలవుతున్నారు. లక్ష్మణచాంద నుండి బాబాపూర్ వెళ్లే రోడ్డు పక్కనే ఒక రైతు వారి పంట రక్షణ కోసం సోలార్ విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకున్నారు.

క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం/ లక్ష్మణచాంద ఎఈ/ మల్లేష్‌ : రైతులు వారి పంట రక్షణ కోసం అక్రమంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం . రైతులు వారి పంట రక్షణ కోసం సోలార్ విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ప్రమాదం జరుగవు.

Electrical wires to Crop Fields

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యథేచ్చగా పంట పొలాలకు విద్యుత్ తీగలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.