పేలిన ఈ-బైక్: 5గురు మృతి

చైనా: చార్జీంగ్ బైక్ పేలి ఐదుగురు మృతి చెందిన సంఘటన చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ గులియన్ లోన ఓ నివాస సముదాయంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఇంటి యజమాని విద్యుత్ తో నడిచే బైక్ కు చార్జింగ్ పెట్టగా బైక్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి పోగలతో మంటలు లేచాయి. అనంతరం బైక్ మంటలతో ఎగిసిపడి పేలిపోయింది. బైక్ పేలడంతో మంటలు చుట్టుపక్కల ఇండ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 5 ఇండ్లు […] The post పేలిన ఈ-బైక్: 5గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చైనా: చార్జీంగ్ బైక్ పేలి ఐదుగురు మృతి చెందిన సంఘటన చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ గులియన్ లోన ఓ నివాస సముదాయంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఇంటి యజమాని విద్యుత్ తో నడిచే బైక్ కు చార్జింగ్ పెట్టగా బైక్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి పోగలతో మంటలు లేచాయి. అనంతరం బైక్ మంటలతో ఎగిసిపడి పేలిపోయింది. బైక్ పేలడంతో మంటలు చుట్టుపక్కల ఇండ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 5 ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో  ఐదుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందగా,మరో 38 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. అనంతరం గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Electric scooter explodes while charging In China

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పేలిన ఈ-బైక్: 5గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: