కన్పించే దంతాలు, తినే దంతాలు

  శాసనసభలకు, లోక్‌సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనుకుంటే రాజ్యసభవలె ప్రతి రెండేళ్ళకోసారి ఎన్నికలు జరుపుతూ, ఐదేళ్ళకు రిటైర్ అయ్యే విధంగా రాజ్యాంగ సవరణ చేసుకోవడం అవసరం. అప్పుడు రాజ్యసభవలె లోక్‌సభ, శాసనసభలు, శాంతియుతంగా సమాజ పరివర్తన, పరిపాలనలో రాజకీయ అధికారంలో పరివర్తన సాగుతుంది. రెండేళ్ళ పరిపాలన చూసి ప్రజలు, ప్రతి రెండేళ్ళకు వచ్చే ఎన్నికల్లో వారికి మద్దతు ఇవ్వడమో, కొత్త వారిని ఎన్నిక చేసుకోవడమో నిర్ణయించుకుంటారు. అలా ఆయా ప్రభుత్వాలపై ప్రత్యక్షంగా తమ మద్దతును, వ్యతిరేకతను […] The post కన్పించే దంతాలు, తినే దంతాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

శాసనసభలకు, లోక్‌సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనుకుంటే రాజ్యసభవలె ప్రతి రెండేళ్ళకోసారి ఎన్నికలు జరుపుతూ, ఐదేళ్ళకు రిటైర్ అయ్యే విధంగా రాజ్యాంగ సవరణ చేసుకోవడం అవసరం. అప్పుడు రాజ్యసభవలె లోక్‌సభ, శాసనసభలు, శాంతియుతంగా సమాజ పరివర్తన, పరిపాలనలో రాజకీయ అధికారంలో పరివర్తన సాగుతుంది. రెండేళ్ళ పరిపాలన చూసి ప్రజలు, ప్రతి రెండేళ్ళకు వచ్చే ఎన్నికల్లో వారికి మద్దతు ఇవ్వడమో, కొత్త వారిని ఎన్నిక చేసుకోవడమో నిర్ణయించుకుంటారు. అలా ఆయా ప్రభుత్వాలపై ప్రత్యక్షంగా తమ మద్దతును, వ్యతిరేకతను వెల్లడి చేసి ప్రభుత్వాలను మార్చుకునే అవకాశం అంది వస్తుంది.

ఏనుగుకు కన్పించే దంతాలు వేరు. తినే దంతాలు వేరు. అనేక అందమైన భవనాలు బయటికి కనపడే తీరు వేరు. లోపల నిర్మాణం వేరు. ఒకేసారి లోక్ సభకు, శాసన సభలకు ఎన్నికలు అనే నినాదాన్ని లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమగ్రం గా పరిశీలించాల్సి ఉంది. భారత రాజ్యాంగం స్థిరపర్చిన చక్కని ఎన్నికల వ్యవస్థను మార్చాలనుకుంటే అన్ని విషయాలను, అన్ని కోణాలను, సమగ్రంగా ఆలోచించడం అవసరం. మరింత సమగ్రంగా ప్రజాస్వామ్యాన్ని అమల్లోకి తేవడం అవసరం.

ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిధ్యం అనేది ప్రజాస్వామ్యంలో మౌలికాంశం. మూల స్తంభం అందువల్ల అన్నిరంగాల్లో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, జడ్జీల, న్యాయమూర్తుల నియామకాలు జరగాలి. కేంద్రం, రాష్ట్రం ఎన్నికలు ఒకేసారి అనేదాన్ని మరింత విస్తరించి స్థానిక సంస్థలు, శాసనసభలు, పార్లమెంటు ఎన్నికలు అన్నీ ఒకేసారి జరగాలి. యేటా జరగాలి. లేదా అమెరికా కన్నా అడ్వాన్స్‌గా దేశం ముందుకు వెళ్ళడానికి అమెరికాలో నాలుగేళ్ళకోసారి ఎన్నికలు ఉంటే మనం మూడేళ్ళకోసారి ఎన్నికలు జరుపుకోవాలి. రెండు టర్ముల మించి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉండడానికి వీలు లేదని రాజ్యాంగ సవరణ చేసుకోవడం అవసరం. చట్టసభల ప్రతినిధులతో పాటు ఐఎఎస్, గ్రూప్1, గ్రూప్2, జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు అన్ని స్థాయి ల్లో ప్రజల ఓటు హక్కు చేత నియోజకవర్గాల వారీగా ఎన్నిక చేయబడాలి. అర్హులైన అభ్యర్ధులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ రెండు రంగాలకు అర్హతలు నిర్ణయించి చట్ట సభల ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించాలి. లేదా మూడే ళ్ళు పని చేసిన తర్వాత వారు ప్రజల చేత, ప్రజల ఓట్ల చేత ఎన్నికైతే కొనసాగుతారు అనే విధానాన్ని ప్రవేశపెట్టడం అవసరం.

ఎన్నికలలో ఖర్చు తగ్గాలంటే మరో అద్భుతమైన ఉపాయం ఉంది. బిసి, ఎస్‌సి, ఎస్‌టి ప్రభుత్వ ఉద్యోగులు సెలవు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కల్పిస్తే ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. ఓడిపోతే తిరిగి ఉద్యోగం చేసుకోవచ్చు. గెలిస్తే ఆ పదవీకాలం పూర్తి చేశాక తిరిగి ఉద్యోగంలో చేరవచ్చు. ఈ భద్రత రాజ్యాంగపరంగా కల్పిస్తే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ప్రజల మధ్య జీవించే వారే గెలుస్తారు. మంచి అధికారులు, మంచి అధ్యాపకులు కూడా ఎన్నికల్లో ప్రజల మధ్య వారి హృదయాలను గెలుచుకోవడానికి ప్రజల మధ్యకు వస్తారు. గెలిచే ప్రయత్నం చేస్తా రు. అందువల్ల ఎన్నికల్లో ఖర్చు తగ్గడానికి యేటా ఎన్నికలు నిర్వహించడం, స్థానిక సంస్థల నుండి పార్లమెంటు దాకా ఏకకాలంలో నిర్వహించడం ప్రభుత్వ ఉద్యోగులను, జడ్జీలను కూడా ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం వంటి మౌలిక ఆలోచనలు ఆచరణాత్మకం కావాలి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కాకుండా జన ప్రవాహంతో గెలవడానికి నేడు అనేక ప్రచార, సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చా యి. అందువల్ల మునుపటివలె ఆలోచించకుండా, అందుబాటులోకి వస్తున్న సైన్స్, టెక్నాలజీ సమాచార వ్యవస్థల ప్రాతిపదికపై నూతన ఆలోచనలు ఆచరణలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐదేళ్ళకోసారి ఒకేసారి శాసనసభలకు, లోక్‌సభకు ఎన్నికలు అనేది అంత సులభం కాదు. అవి కేంద్రంలో ఉండే పార్టీల ప్రాచుర్యానికి తిరిగి అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది. ఆయా రాష్ట్రాల స్థానిక, ప్రాంతీయ పార్టీలు, సంస్కృతులు, భాషలు, ఆశ లు, ఆరాటాలు అణగారిపోతాయి. అణచివేయబడతాయి.

లోక్‌సభ, చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు అనే ఆలోచన రాజ్యాంగ నిర్మాతల మౌలిక లక్ష్యాలకు, భారత సమాఖ్య వ్యవస్థ నిర్మాణానికి వ్యతిరేకమైనది. దీనికి స్పష్టమైన ఉదాహరణ రాజ్యసభ. రాజ్యసభకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగి కొంతమంది వెళ్ళిపోతారు. ఆరేళ్ళ తర్వాత రిటైర్ అవుతారు. రాజ్యసభ నిరంతరం కొనసాగుతుంది. రాజ్యాంగ నిర్మాతలు ఇలా ఒక శాశ్వత పార్లమెంటులో ఒక పెద్దల సభ నిరంతరం కొనసాగాలని ఎందుకు పెట్టారు? ఈ విషయం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజ్యసభలో రాష్ట్రాల శాసన సభల వాటా పెంచి, లోక్‌సభలో 543 మంది సభ్యులుంటే శాసనసభల నుండి ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యులు వగైరా అందరు కలిసి రెట్టింపు అనగా వెయ్యికి పైగా రాజ్యసభ సభ్యులు ఉంటే సమాఖ్య స్వభావం, ఫెడరలిజం, దేశం సమైక్యంగా కొనసాగడం జరుగుతుంది.

శాసనసభలకు, లోక్‌సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనుకుంటే రాజ్యసభవలె ప్రతి రెండేళ్ళకోసారి ఎన్నికలు జరుపుతూ, ఐదేళ్ళకు రిటైర్ అయ్యే విధంగా రాజ్యాంగ సవరణ చేసుకోవడం అవసరం. అప్పుడు రాజ్యసభవలె లోక్‌సభ, శాసనసభలు, శాంతియుతంగా సమాజ పరివర్తన, పరిపాలనలో రాజకీయ అధికారంలో పరివర్తన సాగుతుంది. రెండేళ్ళ పరిపాలన చూసి ప్రజలు, ప్రతి రెండేళ్ళకు వచ్చే ఎన్నికల్లో వారికి మద్దతు ఇవ్వడమో, కొత్త వారిని ఎన్నిక చేసుకోవడమో నిర్ణయించుకుంటారు. అలా ఆయా ప్రభుత్వాలపై ప్రత్యక్షంగా తమ మద్దతును, వ్యతిరేకతను వెల్లడి చేసి ప్రభుత్వాలను మార్చుకునే అవకాశం అంది వస్తుంది.

రాజ్యసభ అత్యంత ముఖ్యమైనది. మౌలికమైనది. ఎగుడు దిగుడు లేకుండా, ఈ దేశ పరిపాలన సాగడానికి అది ఒక ఉన్నత న్యాయస్థానంవలె, రిజర్వ్ బ్యాంక్‌వలె, యుపిఎస్‌సి వలె, ఎన్నికల కమిషన్ వలె సంతులనం సాధించడానికి ఒక మౌలిక ఆధారం. అందువల్ల ఎన్నికలను రాజ్యసభకు వలెనే చట్టసభలో మూడో వంతుకు ప్రతి రెండేళ్ళకోసారి ఎన్నికలు జరపాలి. అలాగే రాష్ట్రాల్లో, రాజ్యసభవంటి శాసన మండలిని ఎట్టి పరిస్థితుల్లోను రద్దు చేయడానికి వీలు లేకుండా, రాజ్యాంగ సవరణ చేయడం అవసరం. జిల్లా పరిషత్తులకు, మున్సిపాలిటీలకు, స్థానిక సంస్థలకు కూడా రాజ్యసభవలె సమాంతరంగా ఒక పెద్దల సభ నిరంతరం కొనసాగే విధంగా ఏర్పాటు చేయడం అవసరం. అప్పుడు లోక్‌సభ, రాజ్యసభ రెంటి కలయికతో పార్లమెంట్ సజావుగా సాగినట్టుగా శాసన సభలు, స్థానిక సంస్థలు సజావుగా సాగుతాయి. ఇలా నూతనంగా నూతన పరిస్థితుల్లో ఆలోచించాల్సిన అవసరం, రాజ్యాంగ సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం కొన్ని నగర కేంద్రాల కేంద్రీకృత అభివృద్ధి వల్లే కొన్ని కులాలు, ప్రాంతాలు మాత్రమే ఈ రెండు వ్యవస్థల్లో అవకాశాలు పొందుతున్నారు. ఈ స్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. 1946 నాటి జనాభా నాలుగు రెట్లు పెరిగింది. కనుక ఆయా సామాజిక వర్గాలకు, కులాలకు, ప్రాంతాలకు దామాషా ప్రకారం బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, మహిళా వర్గాలకు ప్రాతినిధ్యం లభించడానికి అనుకూలంగా చట్టసభల సీట్లను, పార్లమెంట్ సీట్లను నాలుగు రెట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసుకోవాలి. అలాగే ప్రాదేశ నియోజకవర్గాల ప్రాతినిధ్యమే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ, మూల స్తంభం గనుక న్యాయస్థానాల్లో ప్రభుత్వ యంత్రాంగంలో, కేంద్ర, రాష్ట్ర, అత్యున్నత అధికారులందరు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేయబడే విధానాన్ని అమల్లోకి తెచ్చుకోవాలి.

తద్వారా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుండి యేటా ఇద్దరు ఐఎఎస్, ఐపిఎస్, పదిమంది గ్రూప్ 1 ఆఫీసర్లు, ముగ్గురు జడ్జీలు చొప్పున ఎన్నికవుతారు. పదేళ్ళ వ్యవధిలో ప్రతి నియోజకవర్గం నుండి జాతీయ స్థాయిలో కనీసం వంద మంది ఉన్నత అధికారులు, జడ్జీలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికార్లు ఎదుగుతారు. వారు దేశంలో ఎక్కడ పని చేసిన తమ ప్రాంత అభివృద్ధి, అవసరాల గురించి, సంస్కృతి గురించి కృషి చేస్తారు. ఇది ఆచరణలోకి వచ్చినప్పుడే మూడు ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ప్రాదేశిక నియోజక వర్గాల ప్రాతినిధ్యం లభిస్తుంది. తద్వారా ప్రతి నియోజకవర్గం స్థాయిలో అభివృద్ధి సంక్షేమం, దేశం మూలమూలలా చేరుతుంది.

Elections to Lok Sabha and Legislative Assemblies

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కన్పించే దంతాలు, తినే దంతాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: