కరోనా వస్తుందనే భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య..

Elderly Couple suicide with Corona fear in Khairatabad

హైదరాబాద్: ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో విషాదం నెలకొంది. కరోనా వచ్చిందనే భయంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు.. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో తమ వల్ల కుటుంబసభ్యులకు కరోనా సోకుతుందన్న అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా మర్చురీకి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్టా పోలీసులు విచారణ చేపట్టారు.

Elderly Couple suicide with Corona fear in Khairatabad

The post కరోనా వస్తుందనే భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.