ట్రక్కు-బస్సు ఢీ: ఎనిమిది మంది మృతి

 

జైపూర్: రాజస్థాన్‌లోని అజ్మర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లమనా గ్రామానికి సమీపంలో ట్రక్కు- బస్సు ఢీకొని ఎనిమిది మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అజ్మర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యుడు అనిల్ జైన్ తెలిపారు. బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 85 ప్రయాణికులు ఉన్నారు. చాలా మందికూలీలు బతుకు దెరువు కోసం జైపూర్ నుంచి గుజరాత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

Eight Members Dead in Bus-Truck Collision

The post ట్రక్కు-బస్సు ఢీ: ఎనిమిది మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.