నేడు రంజాన్

Eid to be celebrated today  in India

గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లీంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్‌మాసం ప్రజలలో ఆనందాన్ని ఇస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రంజాన్ పండుగను ఇంటిలోపలే జరపుకోవాలని సిఎం కెసిఆర్ ముస్లింలక విజ్ఞప్తి చేశారు. రంజాన్ మత సామరస్యాన్ని, మత సహనాన్ని ప్రతిబింబింపచేస్తుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. గంగా జమునా తెహ్జీబ్ కు ఈ పర్వదినం అద్దంపడుతుందని ఆయన చెప్పారు. రంజాన్ మాసంలో దివ్యకురాన్‌బోధనలకు ఎంతో పవిత్రత ఉందని రాష్ట్రగవర్నర్ తమిళిసై చెప్పారు. స్వీయ క్రమశిక్షణ ద్వారా మాత్రమే జీవిత విలువలను గ్రహించగలుగుతామని ఆమెపేర్కొన్నారు. రంజాన్ ‌మాసంలో ఉపవాసదీక్షలు చేసి పర్వదినాన్ని జరుపుకుంటున్న ముస్లీంలందరికి గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఇంట్లోనే జరుపుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు, సేవాదృక్పథం, భక్తి, సోదరభావాలను చాటిచెప్పే ఈ పండుగ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

దివ్యఖురాన్ ఆవిర్భవించిన మాసంలో జరుగుతున్న రంజాన్ మాసాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీష్‌రెడ్డి చెపుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ పేదముస్లీంలకు నిత్యావసరవస్తువులు పంపిణీ చేసిశుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లీంలు కరోనాను పారదోలాలని ప్రార్థనలు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లీంలకు ఎంపి రంజిత్‌తుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు రంజాన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.