అండామసాలా

కావలసినవి : గుడ్లు : నాలుగు, నూనె : జీలకర్ర : టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, దాల్చిన చెక్క: 3 అంగుళాల ముక్క, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కచ్చాపచ్చాగా కొట్టిన ఎండుమిర్చి పొడి: అరటీస్పూను, పసుపు: అరటీస్పూను, వెల్లుల్లి: 2 రెబ్బలు, ఉప్పు: సరిపడా, టమాటోలు: రెండు, మంచినీళ్లు: కప్పు, కొత్తిమీర తురుము. విధానం : కోడిగుడ్లను ఉడికించాలి. తరవాత పెంకు తీసి కాసేపు మంచినీళ్లలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్లసొన సాగకుండా ఉంటుంది. […] The post అండామసాలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కావలసినవి : గుడ్లు : నాలుగు, నూనె : జీలకర్ర : టీస్పూను, ఉల్లిపాయ: ఒకటి, దాల్చిన చెక్క: 3 అంగుళాల ముక్క, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కచ్చాపచ్చాగా కొట్టిన ఎండుమిర్చి పొడి: అరటీస్పూను, పసుపు: అరటీస్పూను, వెల్లుల్లి: 2 రెబ్బలు, ఉప్పు: సరిపడా, టమాటోలు: రెండు, మంచినీళ్లు: కప్పు, కొత్తిమీర తురుము.
విధానం : కోడిగుడ్లను ఉడికించాలి. తరవాత పెంకు తీసి కాసేపు మంచినీళ్లలో వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్లసొన సాగకుండా ఉంటుంది. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు దాల్చినచెక్క ముక్కలు వేయాలి. ఉల్లి ముక్కలు వేగాక దనియాలపొడి, ఎండుమిర్చి పొడి, పసుపు, వెల్లుల్లి, ఉప్పు వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత సిమ్‌లో పెట్టి సన్నగా తరిగిన లేదా మెత్తగా రుబ్బిన టమాటో గుజ్జు వేసి, నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. గ్రేవీ పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తూ దగ్గరగా ఉడికిన తరవాత నీళ్లు వంపేసి గుడ్లను సగానికి కోసి కూరలో వేసి మరికాసేపు ఉడికించి దించాలి. వడ్డించేముందు కొత్తిమీర చల్లాలి.

egg masala curry recipe

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అండామసాలా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.