పర్యావరణ పరిరక్షణకు కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

Minister Srinivas Goudహైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఖైరతాబాద్ లో శుక్రవారం ఎన్విరాన్‌మెంటల్ డీగ్రేడేషన్ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. పర్యావరణ సమతుల్యత కోసం హరితహారం, మిషన్ భగీరథ, 30 రోజుల ప్రణాళిక , మిషన్ కాకతీయ తదితర పథకాలు రాష్ట్రంలో జోరుగా అమలవుతున్నాయన్నారు. పర్యావరణ పరిక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, సంరక్షించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న అడవులను రక్షించుకోవడంతో పాటు కొత్త అడవులను సృష్టించాలన్నారు. అడవులు ఉన్న ప్రాంతాల్లోనే కరవు కాటకాలు రావని, ఈ క్రమంలోనే అడవులను రక్షించుకోవాలని ఆయన చెప్పారు.

Efforts to protect environment : Minister Srinivas Goud

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పర్యావరణ పరిరక్షణకు కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.