ఆర్‌టిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

  రవాణా శాఖ మంత్రి వువ్వాడ అజయ్ కుమార్ హామీ టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో సంస్థాగత అంశాల పై సమీక్ష హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం జూబ్లిహిల్స్‌లో మంత్రి నివాసంలో కలిసిన టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ఉన్నత స్థాయి అధికారుల బృందం కలిసిన సందర్బంగా మంత్రి ఆర్‌టిసి […] The post ఆర్‌టిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రవాణా శాఖ మంత్రి వువ్వాడ అజయ్ కుమార్ హామీ
టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో సంస్థాగత అంశాల పై సమీక్ష

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం జూబ్లిహిల్స్‌లో మంత్రి నివాసంలో కలిసిన టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ఉన్నత స్థాయి అధికారుల బృందం కలిసిన సందర్బంగా మంత్రి ఆర్‌టిసి సంస్థ సంస్థాగత అంశాల పై చర్చించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సిఎంకెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఇటివల రాష్ట్ర కేబినెట్ విస్తరణలో రవాణా శాఖ మంత్రిగా వువ్వాడ అజయ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్, టిఆర్‌అండ్‌బి ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, అధికారులు రవాణా శాఖ మంత్రిని కలిసి పూలబోకేను అందించి శుభాకాంక్షలను తెలిపారు. రవాణా శాఖను మరింత మెరుగైన స్థాయికి తెచ్చే విధంగామంత్రి కృషి చేస్తారని హామి ఇచ్చారని ఎండి సునీల్ శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు పురుషోత్తం, టి.వి.రావు, వినోద్, యాదగిరి, వేంకటేశ్వర్లు, సిపిఆర్‌ఓ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Effort to solve the problems of RTC workers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్‌టిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: