సెల్ ఫోన్ ‘మాయ’

– చిన్నచిన్న సరదాలకు దూరం – నగరాలనుంచి పల్లెల దాకా స్మార్ట్‌ఫోన్ సందడి.. – వ్యసనమా.. అలవాటా..? – టీవీలకు దూరమైన వైనం – పల్లె సంప్రదాయాలు కనమరుగు – నియంత్రణ అవసరమంటున్న నిపుణులు కొండమల్లెపల్లి (నల్లగొండ): పడుకున్నా సెల్‌ఫోన్, తింటున్నా సెల్‌ఫోన్, నడుస్తున్నా సెల్‌ఫోన్, నవ్వుతున్నా, ఎడుస్తున్నా, సంతోషం వచ్చినా ఇలా ప్రతిదానికి సెల్ ఫోన్ సాధనంగా మారింది. మరోలా చెప్పాలంటే శరీరంలో ఒక అవయంలా మారింది. ఒకప్పుడు పట్టణల్లోనే వీటీని ఎక్కువగా వినియోగించేవారు. క్రమంగా పల్లెల్లోకి […] The post సెల్ ఫోన్ ‘మాయ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

– చిన్నచిన్న సరదాలకు దూరం
– నగరాలనుంచి పల్లెల దాకా స్మార్ట్‌ఫోన్ సందడి..
– వ్యసనమా.. అలవాటా..?
– టీవీలకు దూరమైన వైనం
– పల్లె సంప్రదాయాలు కనమరుగు
– నియంత్రణ అవసరమంటున్న నిపుణులు
కొండమల్లెపల్లి (నల్లగొండ): పడుకున్నా సెల్‌ఫోన్, తింటున్నా సెల్‌ఫోన్, నడుస్తున్నా సెల్‌ఫోన్, నవ్వుతున్నా, ఎడుస్తున్నా, సంతోషం వచ్చినా ఇలా ప్రతిదానికి సెల్ ఫోన్ సాధనంగా మారింది. మరోలా చెప్పాలంటే శరీరంలో ఒక అవయంలా మారింది. ఒకప్పుడు పట్టణల్లోనే వీటీని ఎక్కువగా వినియోగించేవారు. క్రమంగా పల్లెల్లోకి విస్తరించాయి. పట్టణాల్లో జీవనాన్ని గడిపే పల్లెవాసులు సెల్‌ఫోన్ మోజులో తమ చిన్న చిన్న సరదాలకు, ఆటలకు, మాటలకు దూరం అవుతున్నారు. కేబుల్ టీవీలను కూడా చూడటం తగ్గుతోంది.
సెల్‌ఫోన్ తో లాభాలు ఎన్నున్నాయో, నష్టాలు అంతేకంటే ఎక్కువగా ఉన్నాయి. ఒకనాడు కేవలం మాట్లాడే సాధనంగా మాత్రమే ఉండేవి, అయితే  నేడు స్మార్టు ఫోన్ సరళమై ధరతో అందుబాటులోకి వచ్చాయి. సెల్ ఫోన్లలో ఇంటర్‌నెట్ కొత్తకొత్త ఫీచర్స్ వచ్చాయి. సెల్ ఫోన్లపై ఉన్న మక్కువతో గ్రామీణ ప్రజలు వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు.. సెల్ ఫోన్లు గ్రామీణ ప్రజల జీవన, ఆర్ధిక, ఆరోగ్య స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

నిద్రలేమి…
మనిషి సగటుగా రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలైన నిద్రపోవాలి. కాని ప్రస్తుతం యువతనిద్రకు దూరమవుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సెల్‌ఫోన్‌ల్లో చాటింగ్ చేస్తూ కాలక్షేపం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అన్‌లైన్‌లో చాటింగ్‌లు, ఫోటోలు షేర్ చేసుకోవడాలు, వాయిస్ రికార్డులు షేరింగ్ తదితరాలతో ఒకే సారి గ్రూపులుగా రాత్రివేళలో పలకరించుకునే సంస్కృతి మొదలైంది. తెల్లవారు జాము వరకు నిద్ర లేకుండా అపై ఉదయాన్నే కాలేజీకో, ఇతర పనులకో వెళాల్సి రావడంతో నిద్ర చాలకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు.

తక్కువ మాట్లాడితే మంచిది…
సెల్ నెట్‌వర్క్‌ల మద్య పోటీతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మాట్లాడుకునే వారి సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. వివిధ ఆఫర్లతో ఆకట్టుకుంటున్న పలు నెట్‌వర్క్ కంపేనీలకు వినియోగదారులు పెరిగిపోతున్నారు. దీంతో వారు మాట్లాడుకునే సమయం పెరుగుతోంది. ఖర్చు తక్కువేనని భావించే అనవసరమైన విషయాలను మాట్లాడుకుంటూ చాలమంది సమయాన్ని వృధా చేసుకుంటుంన్నారు. దీంతో పాటు అనారోగ్యాన్ని కొని తెచ్చకుంటున్నారు. అధికంగా సెల్‌ఫోన్ మాట్లాడితే వారికి తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటోందని వైధ్యులు చెబుతున్నారు.

వీడియో ‘మైండ్’ గేమ్స్…
ఈ మధ్యకాలంలో వీడియో గేమ్స్ సెల్‌ఫోన్ల వాడకం భాగమయ్యాయి. వీటికి యువతతో పాటు చిన్నారులు, పెద్దలు కూడా ఆకర్షితులవుతున్నారు. ఎప్పుడు చూసిన సెల్‌ఫోన్లలో అటలాడేవారి సంఖ్య పెరుగుతోంది. సెల్‌ఫోన్ కుటుంబ, సామాజిక అంతరాలు పెరిగిపోతున్నట్లు ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అవును ఎందుకంటే ఇంటికి వచ్చిన బంధువుల నుచి సైతం సెల్ ఫోన్ చార్జర్ ఉందా, వైఫై ఉందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇళ్లలో ఉండే యువత సెల్‌ఫోన్‌ల్లో వీడియోగేమ్స్‌పైనే దృష్టి సారిస్తున్నారు. ఇది మానసిక రుగ్మతలకు దారితీస్తోంది.

క్రమంగా క్షీణిస్తున్న కేబుల్
సాయంకాలం వరకు పనులు చేసుకుని చీకటిపడ్డాక ఇళ్ల ఆరుగులపై వీదుల్లో అక్కడక్కడా కొంతమంది చేరి ముచ్చట్లతో కష్టసుఖాలను పంచుకునేవారు. మరికొంత కాలానికి  కేబుల్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. కేబుల్ జనాల అభిరుచి క్రమంగా మారుతూ వచ్చింది. ఒక నాడు పల్లెలో ఉన్న ఇళ్లపై సోరకాయ, బీరకాయ తీగల్లా కెబూల్ వైర్లు  కనిపించేవి. ఇవి నానాటికి తగ్గిపోతున్నాయి. సెల్‌ఫోన్ వీటికి కారణం అనే చెప్పవచ్చు. చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా మొబైల్స్ వాడకంతో కేబుల్ చూడటం క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు రాత్రియిందంటే చాలు ఒక్కచోట చేరి సిరియల్స్ చూసేవారు. కానీ నేడు కేబుల్ కేవలం వృద్దులు, గృహణులే చూస్తున్నారు. మిగతా వారంతా మొబైల్ మోజులో పడి కేబుల్ చూడటం మానేశారు.

అన్నింటికి మూలం ఫోనేనా…
గతంలో తోలుబొమ్మలాట, బుర్రకథ, యక్షగానాలు, వీధినాటకాలు, పల్లెల్లో ఎక్కడో ఓ చోట ఉనికిలో ఉండేవి. హర్మోనియం, తబలా, పుల్లనగోవి, గ్రామీణ వాయిద్యాలు, కాస్తోకూస్తో వినిపించేవి. గ్రామీణ యువకులు కబడ్డీ, కొలాటాలు, యువతులు చెమ్మ చెక్కలు పాటలు, నానమ్మ చెప్పే కథలు కాస్త కంచికి కెళ్లాయి. అంతో ఇంతో మిగిలి ఉన్న సంప్రదాయాలకు సెల్‌ఫోన్ రాక గొడ్డపెట్టులా మారింది. రకరకాల కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నారు. ఇంకేముందు పిల్లల నుంచి వృద్దుల వరకు సెల్‌మాయలో పడ్డారు. వయస్సుతో నిమిత్తం లేకుండా సెల్‌ఫోన్‌లో నిమిగ్నమై అన్నిటిని మరిచిపోతున్నారు.చీకటి పడితే చాలు టీవీలకు అతుక్కుపోయే జనం వాటి జోలికి వెళ్లకుండా చెతిలో సెల్ పట్టుకుని అర్ధరాత్రి దాక జాగారం చేస్తున్నారు. సెల్ మేనియా ఎంత దూరం వెళ్లిందంటే వద్దని వారిస్తే ప్రాణాలు తీసుకునే దాక వెళ్లింది. సెల్ మాయ నుంచి బయపటడేందుకు , కుటుంబం ఆహ్లాదంగా ఉండేందుకు తిరిగి పాత సంప్రదాయాల్లోకి వెళ్లాల్సిందే.

Effect to Health with Cell Phone

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సెల్ ఫోన్ ‘మాయ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: