కళాశాలల్లో కీచక అధ్యాపకులు..!

  తిమ్మాపూర్ : విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేయాల్సిన అధ్యాపకులే వారి జీవితాలను నాశనం చేసేందుకు పూనుకుంటున్నారు. విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్దాల్సిన పంతుల్లే పాపపు పనులకు పాల్పడుతున్నారు. తండ్రి తర్వాత స్థానం గురువుదే అయినా.. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ గురువు అనే పదం అర్థమే మారుస్తున్నారు. మండలంలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వరుసగా వస్తున్న ఆరోపణలతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాము చదువుకునే […] The post కళాశాలల్లో కీచక అధ్యాపకులు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తిమ్మాపూర్ : విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేయాల్సిన అధ్యాపకులే వారి జీవితాలను నాశనం చేసేందుకు పూనుకుంటున్నారు. విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్దాల్సిన పంతుల్లే పాపపు పనులకు పాల్పడుతున్నారు. తండ్రి తర్వాత స్థానం గురువుదే అయినా.. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ గురువు అనే పదం అర్థమే మారుస్తున్నారు. మండలంలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వరుసగా వస్తున్న ఆరోపణలతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాము చదువుకునే కళాశాలల్లో కామాంధులై ఉన్న అధ్యాపకులను చూస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

దాదాపు నెల రోజుల క్రితం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన హెచ్‌వోడీపై వచ్చిన ఆరోపణలు మరువకముందే అదే కళాశాలకు చెందిన మరో అధ్యాపకుడిపై అలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల క్రితం అమ్మాయిని తన గదికి రావాలంటూ సదరు హెచ్‌వోడీ వాట్సాప్‌లో చాటింగ్ చేయగా.. రెండు రోజుల క్రితం మరో అధ్యాపకుడు ఏకంగా ఒకడుగు ముందుకేసి తమ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి కళాశాల విద్యార్థులు తమ కళాశాలకు కీచక అధ్యాపకుడిని తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. కాగా బాధితురాలి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆ కళాశాలకు పరీక్షా కేంద్రం అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి తమ కళాశాలకే కాకుండా ఇంకా మరే కళాశాల విద్యార్థినికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే కాస్త చదువులో వెనకబడిన వారినే లక్షంగా చేసుకున్న సదరు అధ్యాపకులు పరీక్షల్లో తక్కువ మార్కులు వేస్తామంటూ అమ్మాయిలను బెదిరించడం.. వారిని ఏ విధంగానైనా దగ్గరికి తీసుకొని పిచ్చిపిచ్చి పనులకు పాల్పడడం ప్రస్తుతం కళాశాలల్లో పరిపాటిగా మారింది. విద్యార్థుల తప్పిదాలను మాత్రమే లక్షంగా పెట్టుకున్న లెక్చరర్లు.. వాటిని చక్కదిద్దడం మానుకొనీ, విద్యార్థులను బెదిరిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. తమ బిడ్డలకు మంచి పేరున్న కళాశాలల్లో చేర్పిస్తే అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు బాగా చదువు చెప్పి తమ పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తారనుకుంటే ఇలాంటి పాడు పనులు చేస్తున్న పరిస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కళాశాలల్లో ఉన్న కామాంధులకు అక్కా చెల్లెళ్లుగానీ, బిడ్డలుగానీ లేరా అని ప్రశ్నిస్తున్నారు. సదరు కళాశాలలో ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనీ, అసలు అలాంటి వారిని లెక్చరర్లుగా ఎందుకు నియమించుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కళాశాల యాజమాన్యాలు వారి పిల్లలను ఎలా చూసుకుంటారో తమ పిల్లలను అలా చూసుకున్నప్పుడే ఇలాంటివి తగ్గుతాయనీ, ప్రతి కళాశాలలో విద్యార్థుల పట్ల గురువులకు సద్భావన ఉన్నప్పుడే ప్రైవేట్ కళాశాలల మనుగడ సాగుతుందంటున్నారు.

Educator who Harashed Girls in College

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కళాశాలల్లో కీచక అధ్యాపకులు..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: