విద్యా వ్యవస్థ విధానం మారాలి…

Education

 

విద్యా, వైద్యంపైనే సిఎం కెసిఆర్ దృష్టి
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

నల్లగొండరూరల్ : తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైన ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన కేజిటూపిజి ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఎంఎన్‌ఆర్ కన్వెక్షన్ హాల్‌లో నిర్వహించిన విద్యాసదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశ భవిష్యత్ లో నూతన విద్యావిధాన పాలసీ విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రాథమిక దశ విద్య అనేది చాల కీలకమైందని అది లేకపోతే ఉన్నత స్థాయికి ఎదగాలంటే కష్టమన్నారు.

విద్య అనేది ఎక్కడ చదివిన ఒకే విధంగా ఉంటుందన్నారు. గొప్ప విద్యాసంస్థల్లో చదివితే ఉన్నత స్థాయికి వస్తామనుకోవడం ఆపోహా మాత్రమే అన్నారు. కొత్త విద్యావిధానం ఏ రాష్ట్రానికి అనుకులంగా ఉంటే ఆ రాష్ట్ర విద్యావిధానం అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానా న్ని రూపొందించాల్సిన అవసం ఎంతైన ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించడంలో ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కు వ బాధ్యత విద్యాసంస్థలపై ఉంటుందన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఇరిగి పెద్దయ్య, సూర్యాపేట వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ట్ర స్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, కేజిటూపిజి జేఏసి చైర్మన్ బిం దెల రమణారెడ్డి, ఎంజియు కన్వీనర్ సూర్యానారాయణరెడ్డి, కో కన్వీన ర్ ఆదిత్య, ట్రస్మా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు వైద్యం వెంకటేశ్వర్లు, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంట్ల అనంతరెడ్డి పాల్గొన్నారు.

Education system policy must change

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విద్యా వ్యవస్థ విధానం మారాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.