ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు విద్యార్థుల క్యూ

ఎంసెట్ ఫలితాలతో కిక్కిరిసిన విద్యార్థులు నేటితో ముగియనున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ లక్కీ డ్రాలో ఇద్దరు విద్యార్థులకు లాప్‌ట్యాప్‌లు మనతెలంగాణ/హైదరాబాద్ : టిన్యూస్,అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫెయిర్ ఆదివారం విద్యార్థుల, తల్లిదండ్రులతో కిటకిటలాడింది. ఎంసెట్ ఫలితాలు వెలువడటంతో వేలాది మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఎడ్యుకేషన్ ఫెయిర్ విచ్చేసి ఫెయిర్‌కు వచ్చిన తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. తమకు వచ్చిన ర్యాంక్‌కు ఎ క్కడ సీటు దొరుకుతుంది, […] The post ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు విద్యార్థుల క్యూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎంసెట్ ఫలితాలతో కిక్కిరిసిన విద్యార్థులు
నేటితో ముగియనున్న ఎడ్యుకేషన్ ఫెయిర్
లక్కీ డ్రాలో ఇద్దరు విద్యార్థులకు లాప్‌ట్యాప్‌లు

మనతెలంగాణ/హైదరాబాద్ : టిన్యూస్,అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫెయిర్ ఆదివారం విద్యార్థుల, తల్లిదండ్రులతో కిటకిటలాడింది. ఎంసెట్ ఫలితాలు వెలువడటంతో వేలాది మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఎడ్యుకేషన్ ఫెయిర్ విచ్చేసి ఫెయిర్‌కు వచ్చిన తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. తమకు వచ్చిన ర్యాంక్‌కు ఎ క్కడ సీటు దొరుకుతుంది, ఏ కాలేజీలో సీటు లభిస్తుందన్న సందేహాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు దాదాపు 70 కళాశాలలకు చెందిన సిబ్బంది విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ ఫెయిర్‌కు మూడవ రోజు భారీ సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు వచ్చ తమకు కావాల్సిన సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులు కుటింబీకులు తమ విద్యార్థుల కోర్సుల కోసం ఎక్కడా తిరుగకుండా రాష్ట్ర, దేశ, విదేశాలలోని కోర్సుల వివరాల కోసం 70 కళాశాలలకు(విద్యాసంస్థలు) సమాచారం అందిస్తుండటంతో విద్యార్థులతో పాటు టు తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.

లక్కీడ్రాలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు

టిన్యూస్,అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫెయిర్ పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు లక్కీడ్రా నిర్వహించారు. ఈ క్రమంలో పల్లవి ఇంజినీరింగ్ కాలేజ్ చైర్మన్ కొమరయ్య లక్కీ డ్రా తీయడంతో పద్మారావ్ నగర్‌కు చెందిన విద్యార్థిని సరయు ల్యాప్‌టాప్ గెలుచుకుంది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా తీసిన మరో లక్కీ డ్రాలో మలక్‌పేటకు చెందిన విద్యార్థిని అముక్తమాల్యదకు లాప్‌టాప్ దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో టిన్యూస్ సిజిఎం ఉపేందర్, రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వనాథం, టి న్యూస్ డిజిఎం కిరణ్‌కుమార్, ఎపెక్స్ ప్రతినిధి దినేష్, విశ్వవిశ్వాని కళాశాల ప్రతినిధి శ్రీరామకృష్ణ, డిజి కిష్ట్ యానిమేషన్ సంస్థ ప్రతినిధి వినీల వారణాసి తదితరులు పాల్గొన్నారు.

కిటకిటలాడిన విద్యాసంస్థల స్టాల్స్ ః టిన్యూస్, అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫెయిర్‌లో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్, ఫార్మసి, మేనేజ్‌మెంట్, విదేశి వైద్య విద్య,ఆయుర్వేద, హోమియో విద్యాసంస్థలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. ఈక్రమంలో విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో దాదాపు 70 విద్యాసంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. నెల 7 వ తేదీన ప్రారంభమైన స్టాల్స్ ఆదివారం ఎంసెట్ ఫలితాలు వెలుడగానే భారీ సంఖ్యలో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు చేరుకున్నారు. విద్యార్థులకు వచ్చిన ర్యాంకులకు ఏ కోర్సులు లభిస్తాయన్న అనుమానాలను స్టాల్స్‌లోని కళాశాల సిబ్బంది అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇదిలావుండగా కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉన్నత విద్యపై అవగాహన లేకపోవడంతో వారి సమీప బంధువులతో స్టాల్స్‌ను సందర్శించడం గమనార్హం.

నేటితో ఎడ్యుకేషన్ ఫెయిర్ ముగింపు

మూడు రోజలుగా నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫెయిర్ నేటితో(సోమవారం) ముగియనుంది. ఎంసెట్ ఫలితాలు ఆదివారంనాడే వెలువడిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు తెలంగాణాస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను సోమవారం నిర్వాహకులు పొడిగించారు. విద్యార్థుల ఉజ్వల భవిషత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు వివరించారు.

ఒకే వేదికలో కోర్సుల వివరాలు

ఇంటర్ పూర్తిచేసిన తరువాత ఎలాంటి కోర్సు చేయాలన్న సమాచారం కోసం ఎక్కడికీ తిరుగకుండా టిన్యూస్, అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వారు ఒకే వేదికలో పూర్తి సమాచారం ఇస్తుండటం ఆనందంగా ఉందని సికిందరాబాద్‌కు చెందిన విద్యార్థిని చందన పేర్కొంది. ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమయం వృధా కాదని తెలిపారు. కోర్సులు, కాలేజీలు, ఫీజుల వివరాల సమాచారంతో పాటు అవగాహన కలుగాలంటే ప్రతి విద్యార్థి వారి కుటుంబ సభ్యులతో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను సందర్శించాలన్నారు. – చందన, విద్యార్థిని

ఎడ్యుకేషన్ ఫెయిర్ అద్భుతం

తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం అద్భుతమని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ మూర్తి పేర్కొన్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఇంజనీరింగ్ విద్యపై పూర్తిస్థాయిలో అవగాహన వస్తోందన్నారు. ఇటు విద్యార్థులు తమ అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకుంటుండగా అటు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలల ఎంపిక చేసుకుంటున్నారన్నారు. ఇంజనీరింగ్‌లో బ్రాంచీల వివరాలు, కోర్సుల ఎంపికకు ఈ తరహా ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

సీటు కాడు..కోర్సు ముఖ్యం
ఇంజినీరింగ్ విద్యలో సీటు దక్కడం ముఖ్యం కాదని విద్యార్థి కోర్సును ఎంపిక చేసుకోవడం ముఖ్యమని ఒయు ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులు ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల కన్నా కాలేజీలను ఎంచుకోవడంలో జాగ్రత్తలు వహించాలన్నారు. విద్యార్థులు అవగాహన కోసం టి న్యూస్, అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సంయుక్తంగా నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నిర్వహించిన గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్‌లు విద్యార్థులకు సువర్ణ అవకాశంగా భావించాలన్నారు. ఇంటర్ పూర్తి అయిన వెంటనే ఇంజినీరింగ్, ఎంబిబిఎస్ కాకుండా అనేక కోర్సులున్నాయని కూడా విద్యార్థులు గుర్తించాలన్నారు. గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
– ప్రొఫెసర్ లక్ష్మినారాయణ, ఒయు ఇంజినీరింగ్ కళాశాల

తెలియనివి తెలుసుకున్నాను
ఇంజినీరింగ్ విద్యపై ఉన్న కొన్ని అనుమానాలు టిన్యూస్, అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ తొలగిపోయాయని, అలాగే ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించి తెలియని విషయాలను తెలుసుకున్నానని వెస్ట్ మారేడిపల్లికి చెందిన విద్యార్థిని పి.సుదీప్తి పేర్కొంది. ఎంసెట్ ఫలితాలలో తనకు 25000 ర్యాంక్ వచ్చిందని, తనకు వచ్చిన ఏ కళాశాలలో సీటొస్తుంది, ఏ కోర్సులో చేరితే మంచిదన్న విషయాలు ఇక్కడికి వచ్చాకే తెలిశాయని వివరించింది. – పి.సుదీప్తి, విద్యార్థిని

సందేహాలుంటే సందర్శించాల్సిందే
ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎమైనా సందేహాలుంటే టిన్యూస్,అపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫెయిర్‌ను సందర్శించాలని విద్యార్థిని చిత్ర తల్లిదండ్రులు హరినాథ్, విజయలు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో వివిధ రంగాలలోని నిపుణులతో నిర్వహిస్తున్న సెమినార్లు ఆకట్టుకుంటున్నాయని, ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ఎన్నో విద్యాసంస్థలు తమ కళాశాలల సమాచారం అందిస్తున్నాయన్నారు.
– జి.హరినాథ్, విద్యార్థిని తండ్రి
– మూర్తి, శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల

The post ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు విద్యార్థుల క్యూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: