ఈ నెల 24 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు

  హైదరాబాద్ : బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 24 నుంచి చేపట్టనున్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్‌ను నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ఆర్.లింబాద్రి, వి.వెంకటరమణ, ఒయు రిజిస్ట్రార్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఎడ్‌సెట్ కన్వీనర్ మృణాళిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మే […] The post ఈ నెల 24 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణను ఈ నెల 24 నుంచి చేపట్టనున్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో షెడ్యూల్‌ను నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ఆర్.లింబాద్రి, వి.వెంకటరమణ, ఒయు రిజిస్ట్రార్ సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఎడ్‌సెట్ కన్వీనర్ మృణాళిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మే 23వ తేదీన ఆన్‌లైన్ విధానంలో రెండు సెషన్లలో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఎడ్‌సెట్ షెడ్యూల్
-దరఖాస్తుల స్వీకరణ: ఫిబ్రవరి 24 నుంచి
-స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25
-రూ.వెయ్యి అపరాధ రుసుముతో: ఏప్రిల్ 30
-రూ.2 వేల అపరాధ రుసుముతో: మే 4 వరకు
EDCET applications from 24th of this month

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఈ నెల 24 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.