10న హాజరు కావాలని కొచ్చర్‌కు ఇడి సమన్లు

  ముంబై: జూన్ 10న హాజరు కావాల్సిందిగా ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ చందా కొచ్చర్‌కు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీ చేసింది. రూ.1,875 కోట్ల వీడియోకాన్ రుణం కేసులో జూన్ 10న ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ ఢిల్లీలోని జామ్‌నగర్ ఆఫీస్‌లో ఏజెన్సీ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్టు ఇడి సీనియర్ అధికారి తెలిపారు. గత నెలలో పలుమార్లు కొచ్చర్ కుటుంబ సభ్యులను ఇడి ప్రశ్నించింది. వీడియోకాన్ మనీల్యాండరింగ్ కేసులో […] The post 10న హాజరు కావాలని కొచ్చర్‌కు ఇడి సమన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: జూన్ 10న హాజరు కావాల్సిందిగా ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ చందా కొచ్చర్‌కు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీ చేసింది. రూ.1,875 కోట్ల వీడియోకాన్ రుణం కేసులో జూన్ 10న ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ ఢిల్లీలోని జామ్‌నగర్ ఆఫీస్‌లో ఏజెన్సీ ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్టు ఇడి సీనియర్ అధికారి తెలిపారు. గత నెలలో పలుమార్లు కొచ్చర్ కుటుంబ సభ్యులను ఇడి ప్రశ్నించింది. వీడియోకాన్ మనీల్యాండరింగ్ కేసులో విచారణను ఇడి విస్తృతం చేయనుంది.

ఈ కేసులో చందా కొచ్చర్‌తో పాటు బ్యాంకు ఉన్నతాధికారులను మరోసారి ప్రశ్నించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో చందా కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను గతనెలలో ప్రశ్నించిన ఇడి వారి స్టేట్‌మెంట్‌లను నమోదు చేసింది. కాగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కొన్ని వ్యక్తిగత కారణాలతో తనకు కొంత సమయం కావాలని కోరిన చందా కొచ్చర్ త్వరలోనే ఇడి ఎదుట హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి మనీల్యాండరింగ్ చట్టం కింద చందా కొచ్చర్ ఆమె మరిది రాజీవ్ కొచ్చర్‌ల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఇడి యోచిస్తోంది.

ED summons Chanda Kochhar on June 10

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 10న హాజరు కావాలని కొచ్చర్‌కు ఇడి సమన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: