కోర్టు అంటే ఏమనుకుంటున్నారు?

రాజకీయ ఎజెండాతో వచ్చారా? ఇసి విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవు ముందస్తు ఎన్నికలు వద్దంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య  మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించరాదన్న పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన రిట్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి టిబిఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్‌వి భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ […]

రాజకీయ ఎజెండాతో వచ్చారా?
ఇసి విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవు
ముందస్తు ఎన్నికలు వద్దంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య 

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించరాదన్న పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన రిట్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి టిబిఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి ఎస్‌వి భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ఎజెండాతో కోర్టుకు వచ్చారా, కోర్టును రాజకీయ అవసరాల కోసం వేదికగా చేసుకుంటారా, కోర్టు అంటే ఏమనుకుంటున్నారు? మీరు కోరుకున్నట్లుగా పనిచేయాలని భావిస్తున్నారా.. అని డివిజన్ బెంచ్ పిటిషనర్‌పై నిప్పులు చెరిగింది. మీరు దాఖలు చేసిన రిట్‌లో ముందస్తు ఎన్నికలపైగానీ, అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడంపైగానీ, కేం ద్ర ఎన్నికల సంఘం (ఇసి) తీసుకుంటున్న నిర్ణయాల్లోగానీ రా జ్యాంగ వ్యతిరేకత ఉన్నట్టు ఆధారాలు చూపలేదు కదా? అని కూడా బెంచ్ ప్రశ్నలు సంధించింది. లోక్‌సభతో పాటే అసెంబ్లీ కి కూడా కలిపి ఎన్నికలు నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల 200 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కాకుండా అవుతుంది.

స్వల్పకాలంలో అసెంబ్లీకి, లోక్‌సభకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ధన వ్యయం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసేలా ఇసికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం బెంచ్ విచారించింది. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోడానికి కచ్చితమైన ఆధారాలు ఉండాలని, చట్టపరమైన, రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు జరిగాయని చెబితే జోక్యం చేసుకుంటామని, అయితే ఈ కేసులో ఎక్కడా ఆ విధమైన ఆధారాలు పిటిషనర్ పేర్కొనలేదని హైకోర్టు బెంచ్ తప్పుపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలోగానీ, శాసనసభను గవర్నర్ రద్దు చేయడంలోగానీ, ఈ విషయాల్లో ఈసీ తీసుకున్న నిర్ణయాల్లోగానీ తప్పులు ఎక్కడ జరిగాయో చెప్పాలని బెంచ్ కోరింది.

ఇతర రాష్ట్రాలతో కలిపి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలా, లేక లోక్‌సభతోపాటు అసెంబ్లీకి కూడా జమిలి ఎన్నికలు నిర్వహించాలా అనేది పూర్తిగా ఈసీ తీసుకునే నిర్ణయానికి లోబడి ఉంటుందని, ఈ విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని పలు కేసుల్లో సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పిందని బెంచ్ గుర్తు చేసింది. రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనలుగానీ, ప్రజాప్రాతినిధ్య చట్ట ఉల్లంఘనలు జరిగినట్లుగా ఆధారాలు చూపాలని కోరింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్ని ఏపీలో విలీనం చేశాక లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ చే యలేదని మాజీ ఎమ్మెల్యే మర్రి వఘ శిధర్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో న్యాయ పరమైన అంశాలు ఉన్నాయని, అందుకే ఆ కేసులో ఈసీకి నోటీసులు ఇచ్చామని బెంచ్ గుర్తు చేసింది. ఈసీని ప్రభావితం చేసేలా కేసులు దాఖలు చేయరాదని, ఈసీ స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అని, అందుకే ఈ కేసులో జోక్యం చేసుకోవడం లేదని హైకోర్టు బెంచ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కేసు వేస్తే చెల్లుబాటు ఉండదని ముందుగానే వ్యాజ్యం వేశామని పిటిషనర్ లాయర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీకి విడిగా ఎన్నికలు నిర్వహిస్తే రూ.200 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. లోక్‌సభతోపాటే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

ఐదేళ్ల కాల పరిమితి ముగియక ముందే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఎన్నికల నిర్వహణ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియంత్రించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ అభీష్టం మేరకు ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం చెల్లదని, ఓటర్ల జాబితా ఖరారు కాలేదని, కొత్త ఓటర్ల నమోదు, మృతుల ఓట్లు తొలగింపు వంటి కీలక ప్రక్రియ పూర్తి కావాల్సివుందన్నారు. ఓటర్ల ప్రయోజనాలు,హక్కుల్ని కాపాడాల్సివుందని వాదించారు. అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. రాజకీయ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు హైకోర్టును వేదికగా చేసుకోవడం సబబు కాదని పిటిషనర్‌కు హితవు చెప్పింది. ఈ పిటిషన్ దాఖలు వెనుక రాజకీయ ఎజెండా ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేస్తూ ఎన్నికల ప్రకటన జారీ కాకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని వెల్లడించింది. రిట్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Comments

comments

Related Stories: