ఇష్టంగా తినేలా చేయండి…!

Children

 

పిల్లలకు ఎప్పుడూ ఒకే లంచ్ బాక్సు ఇష్టంగా ఉండదు. వారికి రోజుకో ఆకారంలో ఉంటే ఆసక్తి చూపిస్తారు. ఇష్టంగా ఆ బాక్స్‌లో ఉన్నదాన్ని తింటారు కూడా. అప్పుడే బడికి వెళ్లే చిన్నారులకు కొన్ని అలవాట్లను ఇంటి దగ్గరే నేర్పించాలి. అంటే సొంతంగా తినడం అలవాటు చేయాలి. అంతేకాకుండా చేతులు కడుక్కోవడం, మూతితుడుచుకోవడం, తినే పద్ధతి ఇవన్నీ నేర్పించాలి.

దీంతో వాళ్లు బడికెళ్లినప్పుడు తమంతట తామే చక్కగా తినడం పూర్తిచేస్తారు. చేదూ, పులుపూ, కారం…ఇలా అన్నిరుచులూ కలిస్తేనే ఆహారం సంపూర్ణం. అందుకే వారికి అన్ని రుచులూ పరిచయం చేయడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు స్కూలు నుంచి రాగానే ఏదో ఒక చిరుతిండి పెడుతుంటాం. అయితే అవి నూనెల్లో వేయించినవి కాకుండా డ్రైఫ్రూట్స్, పల్లీ పట్టీ, నువ్వుల లడ్డూ, ఓట్స్ బిస్కెట్లు..వంటివి అందించగలిగితే పోషకాహారలోపం అధిగమించొచ్చు.

ఇతర ఆహార పదార్థాలతో పాటు కాలానుగుణంగా వచ్చే అన్ని పండ్లూ తప్పనిసరిగా పిల్లలతో తినిపించాలి. ఇవి జ్యూస్‌ల రూపంలో కాకుండా నేరుగా తినేలా చూడండి. తప్పనిసరి అయితే మిల్క్‌షేక్‌ల్లా చేసివ్వండి. అవసరాన్ని బట్టి ఆయా పండ్లను చక్కని ఆకృతుల్లో కత్తిరించి ఇస్తే ఇష్టంగా తినగలుగుతారు.

Eating Habits should be Taught to Children

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇష్టంగా తినేలా చేయండి…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.