జపాన్‌లో భారీ భూకంపం : 8మంది మృతి

టోక్యో : జపాన్‌లోని హొక్యాడో ద్వీపంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైంది. భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగి పడి పలు భవనాలు కుప్పకూలాయి. దీంతో 8మంది చనిపోయారు. 140మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. థర్మల్ పవర్‌ప్లాంట్ దెబ్బతినడంతో 3లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని రోజులుగా జపాన్‌ను జెబి తుఫాను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ […]

టోక్యో : జపాన్‌లోని హొక్యాడో ద్వీపంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.7గా నమోదైంది. భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగి పడి పలు భవనాలు కుప్పకూలాయి. దీంతో 8మంది చనిపోయారు. 140మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. థర్మల్ పవర్‌ప్లాంట్ దెబ్బతినడంతో 3లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని రోజులుగా జపాన్‌ను జెబి తుఫాను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు ఏమీ లేదని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలను ఖాళీ చేయాలని సూచించారు. భూకంపం రావడంతో హొక్కాయిడోలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్టులో రాకపోకలను నిలిపివేశారు. రైళ్లు, బస్సు సైవలను సైతం తాత్కాలికంగా నిలిపివేశారు. బోమకొమయిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తుపాను బీభత్సం నుంచి తేరుకోకముందే జపాన్ ప్రజలను భూకంపం రూపంలో మరో విపత్తు ఎదుర్కోవడంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి.

Earthquake in Japan : 8 People died

Related Stories: