ఇండోనేషియాలో భారీ భూకంపం

Earthquakeఇండోనేషియాలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైందని ఇండోనేషియా అధికారులు తెలిపారు. టెర్నేట్ ద్వీపంలో ఈ భూకంపం వచ్చింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు తెలియరాలేదు. అదేవిధంగా నికోబార్ దీవిలో కూడా భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నికోబార్ దీవిలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5గా నమోదైంది.

Earthquake In Indonesia On Friday Morning

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇండోనేషియాలో భారీ భూకంపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.