జక్కన్న చిత్రం నుంచి దానయ్య తప్పుకుంటే 100 కోట్లు..?

హైదరాబాద్: ‘బాహుబలి’ సినిమాతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంగతి తెలిసిందే. జక్కన్న ఇప్పటివరకు 11 సినిమాలు తీస్తే అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. తన కెరీర్ లో ఓటమి అనేది లేకుండా, వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు రాజమౌళి. దీంతో ఆయన సినిమా అంటే చాలు ఏనలేని క్రేజ్ ఏర్పడుతోంది. తన తరువాతి చిత్రంగా తారక్, రాంచరణ్ లతో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇక తారక్, […]

హైదరాబాద్: ‘బాహుబలి’ సినిమాతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంగతి తెలిసిందే. జక్కన్న ఇప్పటివరకు 11 సినిమాలు తీస్తే అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. తన కెరీర్ లో ఓటమి అనేది లేకుండా, వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు రాజమౌళి. దీంతో ఆయన సినిమా అంటే చాలు ఏనలేని క్రేజ్ ఏర్పడుతోంది. తన తరువాతి చిత్రంగా తారక్, రాంచరణ్ లతో చేయనున్నాడు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇక తారక్, చెర్రీల కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేగాక బాహుబలితో ఏకంగా 1500 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టిన రాజమౌళి సినిమా కావడంతో ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకుండానే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు  ఓవర్సీస్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఇలా ఈ క్రేజీ ప్రాజెక్టుకు అప్పుడే భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదిలాఉండగా తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయమై ఓ వార్త సినీపరిశ్రమల్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్న డివివి దానయ్య తప్పుకుంటే ఆయనకు భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. జక్కన్న చిత్రానికి తాను ఎంతైనా పెట్టడానికి రెడీగా ఉన్నట్లు చెప్పిన సదరు నిర్మాత, దానయ్య తప్పుకుంటే, రూ. 100 కోట్లను ఇస్తానని చెప్పినట్టు సమాచారం. ఇక దానయ్యకు నిర్మాత ఆఫర్ గురించిన విషయమై అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఇది నిజమేనంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Related Stories: