కార్పొరేట్ వ్యాపార సంస్థలో ఘరానా మోసం..?

నాసిరకం ప్రెషర్‌కుక్కర్‌తో ఆఫర్ అధిక ధరల్లో నిత్యవసర సరుకులు పన్ను రాయితీగల కూల్‌డ్రింక్స్ అమ్ముతున్న వైనం   మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి:  గ్రామాన్ని తలపించే మెదక్ పట్టణంలో కార్పొరేట్ వ్యాపార సంస్థ నెలకొల్పి ఘరానా మోసానికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల సుమారు 15 రోజులక్రితం వెలసిన సూపర్‌మార్కెట్‌లో రోజురోజుకు దోపిడి దందా వెలుగులోకి వస్తుంది. మొదటిరోజు రూ.3499 సంస్థలో కొనుగోలు చేస్తే రూ.975 విలువగల 3 లీటర్ల విలువగల ప్రెషర్ కుక్కర్‌ను ఆఫర్‌గా రూ. 59 కే ఇచ్చి […] The post కార్పొరేట్ వ్యాపార సంస్థలో ఘరానా మోసం..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నాసిరకం ప్రెషర్‌కుక్కర్‌తో ఆఫర్
అధిక ధరల్లో నిత్యవసర సరుకులు
పన్ను రాయితీగల కూల్‌డ్రింక్స్ అమ్ముతున్న వైనం

 

మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి:  గ్రామాన్ని తలపించే మెదక్ పట్టణంలో కార్పొరేట్ వ్యాపార సంస్థ నెలకొల్పి ఘరానా మోసానికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల సుమారు 15 రోజులక్రితం వెలసిన సూపర్‌మార్కెట్‌లో రోజురోజుకు దోపిడి దందా వెలుగులోకి వస్తుంది. మొదటిరోజు రూ.3499 సంస్థలో కొనుగోలు చేస్తే రూ.975 విలువగల 3 లీటర్ల విలువగల ప్రెషర్ కుక్కర్‌ను ఆఫర్‌గా రూ. 59 కే ఇచ్చి వినియోగదారులను ఆకర్షించే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా సదరు సంస్థ నిత్యవసర సరుకులపై రెండు రూపాయల నుంచి 10 రూపాయల వరకు ధరలు పెంచి ప్రెషర్ కుక్కర్‌ను కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించడంతో అమాయక ప్రజలు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

గత రెండు రోజుల తర్వాత కొల్చారం మండలం కొంగోడ్ తండాకు చెందిన ఒ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమాదవశాత్తు మెదక్ నుంచి తీసుకువచ్చిన ప్రెషర్ కుక్కర్ పేలినట్లు తెలిసింది. అలాగే మెదక్ పట్టణంలోని అజంపురలో నివాసం ఉంటున్న హైమద్‌పటేల్ కొనుగోలు చేసిన ప్రెషర్ కుక్కర్ సైతం పేలిపోయి ఐదు సంవత్సరాల బాలునికి చిన్నగా గాయాలైనట్లు తెలిసింది. సదరు సంస్థ నిత్యవసర సరుకులపై జిలకర్ర మెదక్ పట్టణంలో జిలకర్ర, కాజు, కందిపప్పు, చింతపండుతో సహా నిత్యవసర సరుకులపై అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పన్నులేని శీతాల పానియాలను తీసుకువచ్చి మెదక్ కార్పొరేట్ వ్యాపార సంస్థలో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మెదక్ ప్రాంతంలోని సుమారు 100 కుగ్రామాల నుంచి నిత్యం రసాయన పదార్థాలు లేని కష్టంతో పండించిన వాణిజ్య రైతు మెదక్ కూరగాయాల మార్కెట్‌కు తీసుకువచ్చి తక్కువ ధరలకు అమ్ముకుంటున్నామని కార్పొరేట్ సంస్థల్లో కూరగాయాలు అమ్మటం వల్ల అమ్మకాలు జరగకపోవడం వల్ల నష్టపోతున్నామని వాణిజ్య పంటల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు కార్పొరేట్ సంస్థల్లో అమ్ముతున్న కూరగాయాలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక నిఘా వేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిత్యం కొందరు తాజా పండ్లతోపాటు మేలురకమైన పండ్లను తీసుకొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. మెదక్ పట్టణంలో నిజామాబాద్,మహరాష్ట్ర, నాందేడ్ ప్రాంతాల నుంచి వివిధ రకాల పండ్లు డజన్‌తోపాటు మాములు ధరకు మెదక్‌లో విక్రయిస్తున్నారు. సదరు సంస్థలో పండ్లను కేజీలచొప్పున ఇవ్వటంతో కొనుగోలు దారులుగిట్టుబాటు కావడం లేదని ఆరోఫణలు తీవ్రంగా ఉన్నాయి. ఏదిఏమైన కార్పొరేట్ వ్యాపార సంస్థలో జరుగుతున్న మోసాలపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించిన్యాయం చేయాలని మెదక్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.

 

Duplicate Pressure Cooker Blast in Medak

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కార్పొరేట్ వ్యాపార సంస్థలో ఘరానా మోసం..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.