దుబ్బాక ఎంఎల్ఎ కన్నుమూత

Dubbaka TRS MLA Solipeta Ramalinga Reddy died

హైదరాబాద్: దుబ్బాక అధికార పార్టీ ఎంఎల్ఎ సోలిపేట రామలింగారెడ్డి(57)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగరెడ్డి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. రామలింగారెడ్డి ఇటీవలే కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స తర్వాత కాలికి ఇన్ ఫెక్షన్ కావడంతో అస్వస్థతకు గురైయ్యారు. 2004, 2008లో దొమ్మాట నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. 2014, 2018లో దుబ్బాక నుంచి ఆయన ఎంఎల్ఎగా గెలిచారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. హరీశ్ రావు, పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు రామలింగారెడ్డి.

ఆయన రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, కుమారై ఉన్నారు. సోలిపేట రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. అయితే ఇప్పటివకే ఆయన పార్థవదేహం స్వస్థలానికి చేరుకుంది. ఎంఎల్ఎ మృతిపట్ల, మంత్రి కెటిఆర్, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి, పువ్వాడ అజయ్ లు సంతాపం తెలిపారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దుబ్బాక ఎంఎల్ఎ కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.