మద్యం మత్తులో క్యాబ్ బుక్ చేసిన యువతి…

Helen Drydenలండన్: మద్యం మత్తులో ఉన్న లండన్ కు చెందిన ఓ యువతి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసింది. ఆ సమయంలో ఇంటి అడ్రస్ బదులుగా ఆమె చదువుకుంటున్న యూనివర్శిటీ అడ్రస్ పెట్టింది. క్యాబ్ రాగానే ఎక్కేసి ఎంచక్క నిద్రపోయిన యువతి అలా చాలా దూరం ప్రయాణం చేసింది. యువతి ఇచ్చిన అడ్రస్ కు చేరుకొగానే  డ్రైవర్ ఆమెను నిద్రలేపాడు. దాంతో ఇల్లు వచ్చేసిందా? బిల్లు ఎంత? అని అడిగింది. డ్రైవర్ 300 పౌండ్లు(భారత కరెన్సీలో రూ. 27 వేలకు పైగానే) అని చెప్పాడు. అది విన్న యువతి షాక్ అయింది. తేరుకొని చూసిన ఆమె తాను చదువుకుంటున్న యూనివర్శిటీ వద్ద ఉండడంతో తాగింది మొత్తం దిగిపోయింది. వెంటనే తన ఫోన్‌ తీసి చూడగా ఇంటి అడ్రస్ బదులుగా తాను చదువుకున్న యూనివర్శిటీ అడ్రస్ పెట్టినట్టు గుర్తించి తలపట్టుకుంది. ఇక రాత్రివేళ కావడంతో చేసేదేమీలేక మళ్లీ యూటర్న్ తీసుకొని ఇంటికి చేరింది. యూనివర్శిటీ నుంచి మళ్లీ వెనక్కి రావడంతో అదనంగా మరో 100 పౌండ్లు అయ్యాయి. దాంతో యువతికి మొత్తంగా 400 పౌండ్లు(రూ. 36 వేలు) బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తాగిన మైకంలో చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యమే చెల్లించుకున్నానని సదరు యువతి వాపోయింది.

Drunk woman ordered uber from London to Newcastle

The post మద్యం మత్తులో క్యాబ్ బుక్ చేసిన యువతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.