అపాయంలో ఉన్నానంటూ ‘100’కు డయల్…

police
ఖమ్మం: తాను అపాయంలో ఉన్నానంటూ ఓ వ్యక్తి 100 కు డయల్ చేశాడు. దీంతో ఆ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ వ్యక్తి ఉన్న చోటుకు వెళ్లారు. సమస్య ఏంటి అంటూ అక్కడ ఫోన్ చేసిన వ్యక్తిని కానిస్టేబుల్ అడిగాడు. దీంతో మందు కోసం ‘వంద’కు ఫోన్ చేశానని మందుబాబు దర్జాగా సెలవిచ్చాడు. దీంతో కానిస్టేబుల్ షాక్ తిన్నాడు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. అప్పటికే డయల్ వందకు ఫోన్ చేసిన వ్యక్తి ఓ మద్యం దుకాణంలో కూర్చొని మందు తాగుతున్నాడు. వార్డు మెంబర్ అయిన ఓ మహిళ వైన్ షాప్ నడుపుతోందని, పైగా డబ్బు డిమాండ్ చేస్తోందంటూ ఆ దుకాణం నిర్వాహకురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Drunk Man makes prank calls to Dial 100

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అపాయంలో ఉన్నానంటూ ‘100’కు డయల్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.