క’న్నీటి’కష్టాలు

అభివృద్ధికి నోచుకోని రహదారి వ్యవస్థ. కనిపించని భూగర్భడ్రైనేజీ జంటజలాశాయాలు ఉన్న నోటిదాక రానంటున్న మంచినీరు అడుగంటిన భూగర్భ జలాలు రూ.5 వేల పెట్టి ట్యాంకర్ వాటర్ కొంటున్న ప్రజలు హైటేక్ సిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరగా ఉండడం వల్ల ఆ ప్రాంతం శరవే గంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద అపార్టుమెట్లతో పాటు కాలనీలో సుందరమైన భవనాలు కట్టుకుని నివాసం ఉంటున్నవారి పరిస్థితి మాత్రం క‘న్నీ’టి కష్టాలుగా మారుతున్నాయి. కనీసం మంచినీళ్లుకు కూడ […] The post క’న్నీటి’ కష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అభివృద్ధికి నోచుకోని రహదారి వ్యవస్థ.
కనిపించని భూగర్భడ్రైనేజీ
జంటజలాశాయాలు ఉన్న నోటిదాక రానంటున్న మంచినీరు
అడుగంటిన భూగర్భ జలాలు రూ.5 వేల పెట్టి ట్యాంకర్ వాటర్ కొంటున్న ప్రజలు

హైటేక్ సిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరగా ఉండడం వల్ల ఆ ప్రాంతం శరవే గంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద అపార్టుమెట్లతో పాటు కాలనీలో సుందరమైన భవనాలు కట్టుకుని నివాసం ఉంటున్నవారి పరిస్థితి మాత్రం క‘న్నీ’టి కష్టాలుగా మారుతున్నాయి. కనీసం మంచినీళ్లుకు కూడ దొరకక ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆదారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక రహదారుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా చాలా కాలనీలు, బస్తీల్లో నెలకొని ఉన్నాయి. ప్రధాన రహదారులు సైతం గోతుల మ యంగా ఉండడం నిత్యం ప్రమాదాలకు దారితీస్తోంది. విధీ దీపాల నిర్వహనే కాదు, ఏర్పాట్లు అరకొరగానే ఆ ప్రాంత కనిపిస్తున్నాయి.

బండ్లగూడజాగీర్ / రాజేంద్రనగర్ : పంచాయితీలుగా ఉన్న ఆ ప్రాంతాలు నిధుల లేమితో ఊహించిన స్థాయిలో ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధించలేకపోయాయి. దాంతో వారానికి ఒకసారి కూడా న ల్లా నీళ్లు వస్తాయన్న నమ్మకం ప్రజల్లో లేకుండా పోయింది. ఫలితంగా రూ.5 వేలు చెల్లించి ట్యాంక్ వాటర్ కొనుగోలు చేసి ఇళ్లలో నిలువ చేసుకుని జీవనం సాగిస్తున్నారు స్థానికులు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలోని పరిస్థితి అనుకుంటే పొరపాటే. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో ఒకటైన బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ దుస్థితి. కూత వేటు దూరంలో జంట జలాశయాలు ఉన్న ఇక్కడి భూగర్భంలో మాత్రం నీటిశాతాలు విఫరీతంగా పడిపోయాయి. దాంతో వేసిన బోర్లలో నీళ్లు రాక ట్యాంకర్ల కొనగోలు పైనే ఇక్కడ ప్రజలు ఆధారపడాల్సి వ స్తుందంటున్నారు.

వేసవి కావడంతో నీటి ఎద్దడి మరీ తీవ్రంగా మారింది. ఫలితంగా ప్రజలను కన్నీటి కష్టాలు పడాల్సివస్తుందని ఆవేధన వ్యక్త చేస్తున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలో బండ్లగూడ,కిస్మత్‌పూర్,హైదర్‌షాకో ట్,పీరంచెరు,హిమాయత్ గ్రామాలతోపాటు గంధంగూడ, బైరాగిగూడ,దర్గాఖలీజ్‌ఖాన్‌ఆమ్లేటే గ్రామాలు ఉన్నాయి. ఒక్క బండ్లగూడ గ్రామ పంచాయితీ పరిధిలోనే దాదాపు 50 కాలనీలు ఉంటాయి. ఇక మిగిలిన గ్రామాల పరిధిల్లో కొత్తగా వెలసిన, వెలస్తున్న కాలనీల సంఖ్య చాలానే ఉంటుంది. ఈ ప్రాంతాలన్నింటికి తాగునీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉందని స్థానిక ప్రాంతాల మహిళళు ఆవేధనవ్యక్తం చేస్తున్నారు.

రోడ్ల పరిస్థితి మారీ దారుణం

బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలో రహదారుల పరిస్థితి మరీ దారుణం గా ఉంటుంది. పాత గ్రామాల్లో చిన్న రోడ్లు ఉంటే వాటికి అనుసందానంగా ఉ న్న రోడ్ల కొత్త రోడ్ల పరిస్థితి ప్రమాదాలకు నెలవుగా మారిపోయాయి. ఒక్కడ చూసి పెద్దపెద్ద గుంగతలో కూడిన రోడ్లు దర్శినమిస్తున్నాయి. ఇక పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌నిధులతో ఇటీవలీ కాలంలో నిర్మించిన సీ సీ రోడ్లు మినహా అన్ని రోడ్ల పరిస్థితి వాహనదారులకు నరకయాతనను చూపిస్తోంది. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదాలకు లోనవుతున్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ , యాదవమిత్ర కాలనీ, వినాయక్‌నగర్, గాయత్రీనగర్, సన్‌సిటీ, ప్రశాంత్‌నగర్, సాయినగర్, ఇంద్రారెడ్డి న గర్, బ్యాంకు కాలనీ, పిఅండ్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, ద్వారకానగర్, అ భ్యుధయ నగర్, సంధ్యానగర్, మైకేల్‌కాలనీ,మాచన్ ఎన్‌క్లేవ్ ఇలా చెప్పుకుం టూ పోతే దాదాపు 100 కాలనీల్లో రహదారి వ్యవస్థ అభివృద్ధి నోచుకోవడం లేద ని చెప్పాల్సిందే. కిస్మత్‌పూర్ నుంచి బండ్లగూడ మీదుగా హైదర్‌షాకోట్ వరకు ఉన్న ప్రధాన రహదారి అభివృద్ధిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఈ రహదారి ఇరువైపులా భారీ భవంతుల నిర్మాణాలు, కాలనీల అభివృద్ధితో జనాభ పెరిగిన మౌలిక సదుపాయాల కల్పన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.

పురపాలకం అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సిందే

బండ్లగూడ జాగీర్ పురపాలక సంఘంగా ఏర్పడడంతో స్థానికుల్లో ఆనందం కొ ట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక గ్రేటర్‌లోకలిస్తే మరింత మంచిది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పురపాలక శాఖ నుంచి గ్రామ పం చాయితీలతో పోల్చీదే భారీ స్థాయిలో అభివృద్ధి నిధులు ప్రభుత్వం కేటాయిస్తుం ది. దీంతోడ్రైనేజీ వ్యవస్థ, రహదారుల అభివృద్ధి వేగంగా జరుగుతుందనే నమ్మ కం ప్రజల్లో కనిపిస్తోంది.

మరీ ఈ దిశలో అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారో లేదు తేలియదు. కానీ పురపాలక అధికారులు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ బౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాల్సిన అవశ్యకత ఉంది. మహానగరంలో మరో అభివృద్ధి రాజేంద్రనగర్ సర్కిల్ ఏర్పడిన నాటి అభివృద్ధి నిధుల వరద ఈప్రాంతానికి రావాలని ఆ సమీప గ్రామల ప్రజ లు కోరుకుంటున్నా రు. ఇక టౌన్‌ప్లానింగ్ విభాగం ,శానిటేషన్ , ప్రజారోగ్య విభాల ప నితీరు పురపాలక మా ర్గదర్శకాలకు అనుగుణంగా ఇక్కడ స్థాపితం కావాల్సి ఉంది.

Drinking water problems in Bandlaguda Jagir

Related Images:

[See image gallery at manatelangana.news]

The post క’న్నీటి’ కష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: