ఆగస్టు 15 లోపు గ్రామాలకు త్రాగు నీరు

సిఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ మనతెలంగాణ/సిరిసిల్ల: ఆగస్టు 15వ తేదీలోపు మిషన్ భ గీరథ ద్వారా తాగునీటిని గ్రామాలకు సరఫరా చేయాలని సిఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జ రుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. మొదటగా జిల్లాలోని ఇల్లంతకుంట మండలం బోటిమీద పల్లె గ్రామంలో పర్యటించి మిషన్ భగీరథ పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్ పనులు ఆశించిన మేర జరగడం లేదని తెలిపి,ట్రయల్ […]

సిఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్

మనతెలంగాణ/సిరిసిల్ల: ఆగస్టు 15వ తేదీలోపు మిషన్ భ గీరథ ద్వారా తాగునీటిని గ్రామాలకు సరఫరా చేయాలని సిఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జ రుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆమె పరిశీలించారు. మొదటగా జిల్లాలోని ఇల్లంతకుంట మండలం బోటిమీద పల్లె గ్రామంలో పర్యటించి మిషన్ భగీరథ పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్ పనులు ఆశించిన మేర జరగడం లేదని తెలిపి,ట్రయల్ రన్ పనులను జూలై నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించి, ట్రయల్న్‌ల్రో ప్రతిబంధకాలు ఉంటే పరిష్కరించాలన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు అ ందించేందుకు ఆగస్టు 14వ తేదీని డెడ్‌లైన్‌గా పెట్టుకుని ప నులు చేయాలన్నారు.అదే గ్రామంలో ప్రజలతో మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళనపై అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ ఇబ్బందులను స్మితా సబర్వాల్‌కు తెలుపగా,భూ రికార్డుల ప్రక్షాళనలో అ క్కడక్కడా పొరపాట్లు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అతి త్వరలో పొరపాట్లు సరిదిద్ది అర్హులందరికి న్యాయం జరిగేలా చేస్తామని గ్రామ ప్రజలకు తెలిపారు. అనంతరం వేములవాడ మండలం అగ్రహారంలోని మిషన్ భగీరథ వా టర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను స్మితా సబర్వాల్ సందర్శించి నీటి శుద్ధి ప్రక్రియలు, పంప్‌లను పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనులను ఇంజనీర్లు ఆమెకు వివరించారు. అ నంతరం రుద్రవరం ఇంటెక్‌వెల్‌ను సందర్శించిన స్మితాసబర్వాల్ ఇంటెక్‌వెల్ నుంచి వాటర్ ట్రీట్‌మెంట్ కు నీటి స రఫరాను పరిశీలించారు.మిషన్ భగీరథ పనులపై ప్రతిరో జు సమీక్షించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని,ఎక్కడ పనులు పూర్తయితే అక్కడ నీటి సరఫరా చే స్తూ ముందుకు సాగాలని సిఎం కార్యాలయ కార్యదర్శి స్మి తాసబర్వాల్ అధికారులను ఆదేశించారు.పనులు సకాలంలో పూర్తి చేయని గుత్తేదార్లపై, పర్యవేక్షణ సరిగ్గా చే యని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణభాస్కర్ మిషన్ భగీరథ పనులు ఆగస్టు 14వ తేదీలోగా పూర్తి చేయడానికి అనుసరిస్తున్న కార్యాచరణను స్మితా సబర్వాల్‌కు వివరించారు. ఈ పర్యటనలో స్మితా సబర్వాల్ వెంట సిఈ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఈ అమరేంద్ర, ఇఇ ఉప్పలయ్య, ఈఈ ధర్మారెడ్డి ఉన్నారు.

Comments

comments