డాక్టర్ అక్కినపల్లి మినయ్యకు పిహెచ్‌డి ప్రథానం…

నల్లగొండ: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి లో సోమవారం జరిగిన 23వ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి కె. సీతారామరావు చేతుల మీదుగా నల్లగొండ ఎన్జీ కళాశాల రిటైర్డ్ ఆర్దిక అధిపతి, నల్లగొండ ఎకనామిక్స్ అధ్యక్షులు, ఎంవీఎన్ విజ్ణాన కేంద్ర కన్వీనర్ అక్కినపల్లి మీనయ్యకు పిహెచ్‌డి పట్టా ప్రధానం చేశారు. 2018మేలో డాక్టర్ సుందర్‌రావు నేతృత్వంలో సూక్ష్మవిత్తం, పేదరిక నిర్మూలన నల్లగొండ జిల్లాలో స్వయంసహాయక బృందాలపై అద్యయనం అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను డాక్టర్ బిఆర్ […] The post డాక్టర్ అక్కినపల్లి మినయ్యకు పిహెచ్‌డి ప్రథానం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి లో సోమవారం జరిగిన 23వ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి కె. సీతారామరావు చేతుల మీదుగా నల్లగొండ ఎన్జీ కళాశాల రిటైర్డ్ ఆర్దిక అధిపతి, నల్లగొండ ఎకనామిక్స్ అధ్యక్షులు, ఎంవీఎన్ విజ్ణాన కేంద్ర కన్వీనర్ అక్కినపల్లి మీనయ్యకు పిహెచ్‌డి పట్టా ప్రధానం చేశారు.

2018మేలో డాక్టర్ సుందర్‌రావు నేతృత్వంలో సూక్ష్మవిత్తం, పేదరిక నిర్మూలన నల్లగొండ జిల్లాలో స్వయంసహాయక బృందాలపై అద్యయనం అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి విశ్వవిద్యాలయం అక్కినపల్లి మినయ్యకు డాక్టరేట్ ప్రకటించింది. ముఖ్యఅతిధి పద్మగోవర్దన్ మెహత పిహెచ్‌డి ఎంపిల్ గోల్డ్ మెడల్ ప్రధానం చేశారు.

డాక్టర్ అక్కినపల్లి మినయ్య పిహెచ్‌డి పట్టా పొందడం పట్ల ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, నల్లగొండ కనమిక్స్ ఫోరం అధ్యక్షులు టి. భాస్కర్‌రెడ్డి, ఎం. శాతవాహన, షేక్ సుల్తాన, పాలడుగు నరేష్‌కుమార్, ఉపకార్యదర్శి కొండల్, సుధారాణి, ఇందిరా, శోభ, ప్రవళిక, సత్తయ్య, కవిత పలువురు హర్షం వ్యక్తంచేశారు. ఎంవీఎస్ విజ్ణాన సంస్థ మల్లు స్వరాజ్యం, కార్యదర్శి నంద్యాల నర్సింహ్మారెడ్డి, కోశాధికారి జూలకంటి రంగారెడ్డి, సభ్యులు అనంతరామశర్మ, తుమ్మల వీరారెడ్డి, నాగార్జున పలువురు అభినందించారు.

Dr. Akkinapalli Minaiah received PhD degree

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డాక్టర్ అక్కినపల్లి మినయ్యకు పిహెచ్‌డి ప్రథానం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: