డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

  మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మన తెలంగాణ/నర్సాపూర్: నర్సాపూర్ సమీపంలోని నారాయణపూర్ రోడ్డు సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం నర్సాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ పనులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లాలో అసైన్ట్ భూములు కలిగిన అర్హులైన నిరుపేదలకు రెగ్యులర్ చేయడానికి కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం మరింత వేగంగా చేయాలని కాంట్రాక్టర్లకు, […]

 

మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మన తెలంగాణ/నర్సాపూర్: నర్సాపూర్ సమీపంలోని నారాయణపూర్ రోడ్డు సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం నర్సాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ పనులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లాలో అసైన్ట్ భూములు కలిగిన అర్హులైన నిరుపేదలకు రెగ్యులర్ చేయడానికి కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం మరింత వేగంగా చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. నర్సాపూర్‌లో 500 డబుల్ ఇండ్లు నిర్మిస్తున్నారు. దీనినే మోడల్ కాలనీగా మారనుందన్నారు. మరో మూడు నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని తెలిపారు. గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ రెవెన్యూ సభల్లో రికార్డుల సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్రామాల ప్రజల రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరగకుండా వారివారి గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభల్లోనే అధికారుల వద్ద సమస్యలను తీర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Double bedroom works observed collector in Narsapur

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: