1,05,433 సీట్ల కేటాయింపు…

  దోస్త్ తొలివిడత కౌన్సెలింగ్ జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం ఆ కాలేజీల్లో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండదు హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) మొదటి విడత కౌన్సెలింగ్‌లో 1,05, 433 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. మొదటి విడతలో సీట్లు పొందిన టాప్‌టెన్‌లో 10 మంది బాలికలే ఉన్నారని పేర్కొన్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ […] The post 1,05,433 సీట్ల కేటాయింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దోస్త్ తొలివిడత కౌన్సెలింగ్

జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

ఆ కాలేజీల్లో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండదు

హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) మొదటి విడత కౌన్సెలింగ్‌లో 1,05, 433 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. మొదటి విడతలో సీట్లు పొందిన టాప్‌టెన్‌లో 10 మంది బాలికలే ఉన్నారని పేర్కొన్నారు. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛైర్మన్ టి.పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌లు దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా దోస్త్ కన్వీనర్ లింబాద్రి మాట్లాడుతూ, డిగ్రీ కళాశాలల్లో సీట్ల కోసం దోస్త్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 1,21,363 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా, 1,11,429 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారని అన్నారు. అందులో మొదటి ప్రాధాన్యత ఎంపిక చేసుకున్న 75,184 మంది సీట్లు పొందారని, రెండవ ప్రాధాన్యత, ఇతర ప్రాధాన్యతలు ఎంపిక చేసుకున్న 30,459 మంది సీట్లు పొందారని తెలిపారు. దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపులో 65,058(61.7 శాతం) బాలికలు, 40,375(38.3 శాతం) బాలురు సీట్లు పొందారని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లోనే రిపోర్టింగ్

దోస్త్ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది నుంచి ఎంసెట్ తరహాలో ఆన్‌లైన్ రిపోర్టింగ్ విధానం, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలకు వెళ్లవలసిన అవసరం లేదని, ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోరింగ్ చేయాలని అన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయాలని చెప్పారు. మొదటి విడతలో సీట్లు పొంది ఆన్‌లైన్‌లో రిపోర్టు చేయని విద్యార్థుల సీట్లు రద్దవుతాయని అన్నారు. ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు తర్వాత విడతల్లో నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు పొంది ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉన్న విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం లేని విద్యార్థులు రూ.వెయ్యి చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు పొంది ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉన్న విద్యార్థులు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ లేని విద్యార్థులు రూ.వెయ్యి చెల్లించాలని తెలిపారు.

రెండవ దశ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

డిగ్రీలో ప్రవేశాలకు సోమవారం మొదటి విడత సీట్లు కేటాయించగా, అదే రోజు నుంచి రెండవ దశ రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు విద్యార్థులు దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

43 కళాశాలల్లో జీరో అడ్మిషన్లు

దోస్త్ మొదటి విడత కౌన్సెలింగ్ 43 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్స్ నమోదుకాగా,11 కళాశాలల్లో 100 శాతం ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ విద్యాసంవత్సరం డిగ్రీ కళాశాలల్లో 3,83,514సీట్లు అందుబాటులో ఉం డగా, 1,05,433 సీట్లు కేటాయించారు. మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత 2,78,081 సీట్లు ఖాళీగా మిగిలాయి. అయితే దోస్త్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో రిజిష్టర్ చేసుకుని తక్కువ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న 5,996 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు.

జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు: నవీన్ మిట్టల్

డిగ్రీ సెమిస్టర్ తరగతులు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయవలసిన అవసరం లేదని,చివరి విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత జూలై 1వ తేదీనే కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.

దోస్త్‌లో లేని కళాశాలల్లో చేరితే
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాదు

దోస్త్ పరిధిలో ఉన్న కళాశాలల్లో ప్రవేశాలు పొందితేనే ఫీజు రీఎంబర్స్‌మెంట్ వర్తిస్తుందని దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. దోస్త్‌లో లేకుండా సొంతగా ప్రవేశాలు నిర్వహించుకునే కళాశాలల్లో చేరితే బోధనా రుసుములకు అర్హత ఉండదని తెలిపారు. కొన్ని కళాశాలలు న్యాయస్థానానికి వెళ్లి సొంతగా ప్రవేశాలు నిర్వహించుకొనేందుకు అనుమతి తెచ్చుకున్నాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉస్మానియూ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అత్యధికంగా 44,726 మంది విద్యార్థులు సీట్లు పొందగా, కాకతీయ వర్సిటీలో పరిధిలోని కళాశాలల్లో 27,010, శాతవాహన వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 12,355, పాలమూరు వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 8,655, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 5,460 మంది విద్యార్థులు సీట్లు పొందారు. దోస్త్ మొద టి విడతలో సీట్లు పొందిన విద్యార్థుల్లో 40,375 మంది బాలురు, 65,058 మంది బాలికలు ఉన్నారు. కోర్సుల వారీగా చూస్తే బి.కాంలో అత్యధికంగా 39,277 మంది విద్యార్థులు సీట్లు పొందగా, ఆ తర్వాత బిఎస్‌సి లైఫ్ సైన్సెస్‌లో 22,990 మంది, బిఎస్‌సి ఫిజికల్ సైన్సెస్‌లో 29,445 మంది సీట్లు పొందారు. బి.ఎ కోర్సులో కేవలం 37 మంది విద్యార్థులు మాత్రమే సీట్లు పొందారు.

Dosth first phase seats allotments

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 1,05,433 సీట్ల కేటాయింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: