టోల్‌ఫ్లాజాల రుసుం వసూలు చేయవద్దు

  హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి కొన్ని టోల్‌ఫ్లాజాల నుంచి ఉచితంగా వదులుతున్నారు. రుసుం తీసుకోవద్దంటూ నేషనల్ హైవే అధికారులు ఆదేశాలు జారీ నేపథ్యంలో పలు చోట్ల టోల్‌ఫ్లాజాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. పైనుంచి ఆదేశాల నేపథ్యంలో టోల్‌ఫ్లాజాల వద్ద రుసుం వసూలు చేయడం లేదని స్థానికంగా ఉండే అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ ఉన్నన్నీ రోజులు అన్ని టోల్‌ఫ్లాజ్‌ల మీదుగా ప్రయాణించే వాహనాలను ఉచితంగా పంపించేలా నేషనల్ హైవే […] The post టోల్‌ఫ్లాజాల రుసుం వసూలు చేయవద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి కొన్ని టోల్‌ఫ్లాజాల నుంచి ఉచితంగా వదులుతున్నారు. రుసుం తీసుకోవద్దంటూ నేషనల్ హైవే అధికారులు ఆదేశాలు జారీ నేపథ్యంలో పలు చోట్ల టోల్‌ఫ్లాజాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. పైనుంచి ఆదేశాల నేపథ్యంలో టోల్‌ఫ్లాజాల వద్ద రుసుం వసూలు చేయడం లేదని స్థానికంగా ఉండే అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ ఉన్నన్నీ రోజులు అన్ని టోల్‌ఫ్లాజ్‌ల మీదుగా ప్రయాణించే వాహనాలను ఉచితంగా పంపించేలా నేషనల్ హైవే అధికారులు స్పష్టమైన అధికారిక ప్రకటన ఒకటి, రెండు రోజుల్లో చేయనున్నట్టుగా తెలిసింది.

బుధవారం సాయంత్రం రెండు నుంచి మూడు వేలకు పైగా వాహనాలు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లడంతో కొన్నిచోట్ల టోల్‌ఫ్లాజా సిబ్బంది చార్జీలు వసూలు చేసినట్టుగా తెలిసింది. దీనిపై వాహనదారులు నేషనల్ హైవే అధికారులకు ఫిర్యాదు చేయడంతో లాక్‌డౌన్ ఉన్నన్నీ రోజులు అన్ని టోల్‌ఫ్లాజాలు చార్జీలు వసూలు చేయకూడదన్న నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టుగా సమాచారం.

Don’t pay toll plaza fees

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టోల్‌ఫ్లాజాల రుసుం వసూలు చేయవద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: