ఆంక్షలతో 25 నుంచి దేశీయ విమాన సేవలు

  మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం ఢిల్లీముంబై గరిష్ఠ చార్జీ రూ.10 వేలు మూడు నెలలపాటు ఈ ఆంక్షలు కేంద్ర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురి న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో విమాన ప్రయాణం నిషేధించగా, మళ్లీ రెండు నెలల తర్వాత సోమవారం(మే 25) నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. దేశీయ విమాన సేవలను పునఃప్రారంభించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం […] The post ఆంక్షలతో 25 నుంచి దేశీయ విమాన సేవలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
ఢిల్లీముంబై గరిష్ఠ చార్జీ రూ.10 వేలు
మూడు నెలలపాటు ఈ ఆంక్షలు
కేంద్ర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురి

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో విమాన ప్రయాణం నిషేధించగా, మళ్లీ రెండు నెలల తర్వాత సోమవారం(మే 25) నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

దేశీయ విమాన సేవలను పునఃప్రారంభించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన విమాన టికెట్ ధరల మార్గదర్శకాలను విమాన సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దీని ప్రకారం, వచ్చే మూడు నెలల పాటు ఢిల్లీ ముంబై విమాన టికెట్ రూ.3500 నుంచి రూ.10 వేల మధ్య ఉండనుందని కేంద్ర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. విమాన చార్జీలు ఏడు కేటగిరీలుగా విభజించారు. అవి 030 నిమిషాలు, 3060 నిమిషాలు, 6090 నిమిషాలు, 90120 నిమిషాలు, 120150 నిమిషాలు, 150180 నిమిషాలు, 180210 నిమిషాలు అనే ఏడు విభాగాలుగా విమాన సమయాలు ఉంటాయి.

ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే విమానానికి కనీస చార్జీ రూ.3500, గరిష్ఠ చార్జీ రూ.10 వేలుగా ఉండనుంది. ఇది మూడు నెలలపాటు అమలవుతుందని మంత్రి తెలిపారు. విమానాల్లో 40 శాతం సీట్లు తప్పనిసరిగా 50 శాతం దిగువనే రేట్లు ఉండాలి. అంటే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఫ్లైట్‌కు రూ.6700గా ఉండాలి. సోమవారం నుంచి సేవలను ప్రారంభిస్తున్న విమాన సంస్థలు ప్రయాణికులకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. నిబంధనల ప్రకారం, విమానంలో భోజనం సేవలు ఉండవు, ప్రయాణికులు అందరికీ టెంపరేచర్ చెక్ చేయడం, క్రూ సిబ్బంది రక్షణ చర్యలు వంటివి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

అలాగే విమానాల్లో సామాజిక దూరంపై మంత్రి స్పందిస్తూ, ప్రస్తుతం మధ్య సీటు ఖాళీగా ఉంటాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. క్రమంగా విమాన సేవలను ప్రారంభించనున్నారని, దేశంలో కరోనా కేసులు 1.12 లక్షలు దాటాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇటీవల వారాల్లో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు (బుధవారం) అత్యధికంగా 5,609 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఎకనామి ఇంజిన్లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లు అయిన పెద్ద నగరాలు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటు విమాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ప్రభుత్వరంగ ఎయిర్ ఇండియాలు మార్చి 25 నంచి విమాన సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

7 విభాగాలుగా విమానయాన ప్రయాణ ఛార్జీలు
1. 40 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.2000 గరిష్టంగా రూ.6000.
2. 40-60 నిమిషాల మధ్య వ్యవధి ఉన్న విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా 2,500 గరిష్టంగా 7,500 రూపాయలు.
3. 60-90 నిమిషాల మధ్య వ్యవధి ఉన్న విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.3,000 గరిష్టంగా రూ.7,500
4. 90-120 నిమిషాల మధ్య వ్యవధి కలిగిన విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.3,500 గరిష్టంగా రూ.10,000.
5. 120-150 నిమిషాల మధ్య వ్యవధి ఉన్న విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.4,500 గరిష్టంగా రూ.13,000.
6. 150-180 నిమిషాల మధ్య వ్యవధి కలిగిన విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.5,500 గరిష్టంగా రూ.15,700.
7. 180-210 నిమిషాల మధ్య వ్యవధి కలిగిన విమానయాన ప్రయాణానికి ఛార్జీలు కనిష్టంగా రూ.6,500 గరిష్టంగా రూ.18,600.
8. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానయాన ఛార్జీలు కనిష్టంగా రూ.3,500 గరిష్టంగా రూ.10,000.

Domestic flights resume from May 25

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆంక్షలతో 25 నుంచి దేశీయ విమాన సేవలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: