ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా…

mlc-dokka

అమరావతి: తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తూ… టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖను పంపించారు. మండలిలో అధిక సంఖ్యా బలం ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సభ్యులంతా హాజరు కావాలని విప్ పిలుపునిచ్చారు. కానీ మంగళవారం ప్రారంభమైన సభకు డొక్కా గైర్హాజరైయ్యారు. ఇదే సమయంలో ఆనారోగ్య కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. డొక్కా వైఖరిపై ప్రస్తుతం ఎపి రాజాకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న డొక్కా.. ఇటీవల టిడిపి నిర్వహించిన కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని టిడిపి వర్గాలు చెబతున్నాయి. అయితే ఆయన టిడిపి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారా… అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో తెలుగు దేశం పార్టీకి పెద్ద ఝలక్ తగిలిందని చెప్పాలి.  శాసనసభలో టిడిపి సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం నెలకొంది. దీంతో టిడిపి ఎంఎల్ఎలు చర్చకు అడ్డుతగిలారు. సభ్యుల తీరుతో విసిగిపోయిన స్పీకర్ తమ్మినేని సభలోంచి వెళ్లిపోయారు.

Dokka Manikya Vara Prasad resigns for MLC

 

 

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.