కుక్క నోట్లో ఆరు బంతులు…గిన్నిస్ రికార్డు

 

Dog holds 6 tennis balls in mouth
ఒంటారియో: ఓ కుక్క ఆరు టెన్నిస్ బంతులను నోట్లో పెట్టుకొని గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన సంఘటన కెనడాలో జరిగింది. రిట్రైవర్ జాతికి చెందిన ఫిన్లే అనే పేరుగల కుక్క ప్రతి సారి ఇరుగుపొరుగు ఇంట్లో నుంచి బంతులను తీసుకొచ్చింది. ప్రతి సారి అలా చేస్తుండడంతో యజమాని బంతులను బయటవేయగానే ఒక్కోసారి రెండు బంతులను కూడా తీసుకొచ్చేది. కుక్క యజమాని బంతిని వదిలిపెట్టగానే నోట్లో పెట్టుకునేది. ఒక్క సారి ప్రయత్నిస్తే నాలుగు బంతులు నోట్లో ఇమిడిపోయాయి. కానీ అతి కష్టం మీద ఆరు బంతులను కుక్క నోట్లో ఇమిడిపోవడంతో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిందని యజమాని సంతోషం వ్యక్తం చేశాడు. కుక్క నోట్లో నాలుగు బంతులు బయటకు కనిపిస్తుండగా లోపలి బాగంలో రెండు బంతులు ఉన్నాయి. గతంలో ఐదు బంతులను వేరే జాతికి చెందిన కుక్క నోట్లో కరుచుకున్న రికార్డు గిన్నిస్‌బుక్‌లో ఉంది.

 

 

The post కుక్క నోట్లో ఆరు బంతులు… గిన్నిస్ రికార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.