మెడికల్ రిప్‌పై వైద్యుడు రేప్

 


ఢిల్లీ: మెడికల్ రిప్ ను ఓ వైద్యుడు బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో ఓ వైద్యుడు వద్దకు మెడికల్ రిప్‌గా ఓ మహిళ (23) వచ్చేది. దీంతో ఆ వైద్యుడితో ఆమె చనువుగా ఉండేది. ఆ వైద్యుడు మెడికల్ రిప్ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్‌గా మారిపోయాడు. డాక్టర్, మెడికల్ రిప్ పలుమార్లు కలుసుకోవడం జరిగింది. ఇదే అదునుగా భావించిన వైద్యుడు తన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెకు ఫోన్ చేసి రమ్మని కబురు పంపాడు. దీంతో ఆమె వైద్యుడు ఇంటికి వెళ్లింది. మత్తు పదార్థం కలిపిన కూల్ డ్రింక్ తాగడంతో ఆమె నిద్రలోకి జారుకుంది. అనంతరం ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియోను చిత్రీకరించాడు. ఈ వీడియోను చూపిస్తూ పలుమార్లు బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతూ అత్యాచారం చేశాడు. దీంతో మెడికల్ రిప్‌కు సంబంధించినవి డాక్టర్ తన తమ్ముడికి ఇవ్వడంతో డాక్టర్, సదరు మహిళకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వైద్యుడు ఆమెకు సంబంధించిన ఆశ్లీల చిత్రాలను భర్తకు పంపించాడు. ఆ దంపతుల మధ్య గొడవలు జరిగాయి. అనంతరం ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో వైద్యుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి డాక్టర్ ను అరెస్టు చేశారు. వైద్యుడి వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌లో నుంచి వీడియోలను డిలీట్ చేశారు.

The post మెడికల్ రిప్‌పై వైద్యుడు రేప్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.