నైజీరియన్ల వల

  నకిలీ ఇన్‌కంట్యాక్స్ అధికారులకు స్పందించొద్దు వారి ట్రాప్‌లో పడవద్దు ఎలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దు ఈ నెలలో ఇన్‌కంట్యాక్స్ రిటర్న్ దాఖలు, సైబరాబాద్ పోలీసుల సలహా హైదరాబాద్ : నకిలీ ఇన్‌కంట్యా క్స్ అధికారుల మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కోరారు. ఈ నెల ఇన్‌కంట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు చివరి నెల కావడంతో ఇన్‌కం ట్యాక్స్ చెల్లించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ నేరస్థులు, నైజీరియన్లు ఇ న్‌కంట్యాక్స్ […] The post నైజీరియన్ల వల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నకిలీ ఇన్‌కంట్యాక్స్ అధికారులకు స్పందించొద్దు
వారి ట్రాప్‌లో పడవద్దు
ఎలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దు
ఈ నెలలో ఇన్‌కంట్యాక్స్ రిటర్న్ దాఖలు, సైబరాబాద్ పోలీసుల సలహా

హైదరాబాద్ : నకిలీ ఇన్‌కంట్యా క్స్ అధికారుల మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కోరారు. ఈ నెల ఇన్‌కంట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేసేందుకు చివరి నెల కావడంతో ఇన్‌కం ట్యాక్స్ చెల్లించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ నేరస్థులు, నైజీరియన్లు ఇ న్‌కంట్యాక్స్ చెల్లించే వారి మొబైల్ నంబర్లు, డా టాను సేకరించారని తెలిపారు. మెసేజ్‌లు బల్ ్కగా పంపిస్తారని, వాటిలో డియర్ ట్యాక్స్ పేయర్ మీరు ఇంత ట్యాక్స్ పే చేయాలని ఉంటుందని తెలిపారు. ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే అది నకిలీ ఇన్‌కంట్యాక్స్ వారు సృష్టించిన వెబ్‌పేజికి వెళ్తుందని పేర్కొన్నారు.

వెబ్ పేజీలో సెలక్ట్ బ్యాంక్ నేమ్ వద్ద క్లిక్ చేయగానే నకిలీ వెబ్ పేజీ తెరుచుకుంటుందని తెలిపారు. అక్కడ యూజర్ నేమ్, పాస్ వర్డ్‌ను టైప్ చేయగానే టాక్స్ చెల్లించేవారి డాటా మొత్తం సైబర్ నేరస్థుడి చేతిలోకి వెళ్తుందని తెలిపారు. తర్వాత సైబర్ నేరస్థుడు ఇన్‌కంట్యాక్స్ చెల్లించే వారి పేరుతో మెసేజ్ పంపిస్తాడు. /bit.ly/2IN4jNOలింక్‌ను పంపిస్తాడు, దానిపై క్లిక్ చేయగానే బాధితుడి మొబైల్‌లో ఎపికే ఫైల్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీని ద్వారా సైబర్ నేరస్థుడు ఇన్‌కంట్యాక్స్ పేయర్ మొబైల్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకుంటాడు.

బాధితుడి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అటాచ్డ్ చేసుకుంటాడు. వివిధ మొబైల్ నంబర్లను ఉపయోగించి ఓటిపి నంబర్లు రిసివ్ చేసుకుని దశల వారీగా డబ్బులు తీసుకుంటాడు. ఇన్‌కంట్యాక్స్ పేరుతో వచ్చే బల్క్ మెసేజ్‌లకు స్పందించవద్దని, ఫేక్ వెబ్ పేజీలో బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయవద్దని కోరారు. ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ట్యాక్స్ పేయర్స్ వివరాలు ఆన్‌లైన్‌లో అడగదని చెప్పారు. మెసేజ్‌ల ద్వారా వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయవద్దని కోరారు.

Do not Respond to fake Income Tax officers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నైజీరియన్ల వల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: