పోలీసులు ఎన్‌ఒసిలు ఇవ్వొద్దు: హోంమంత్రి మహమూద్ ఆలీ

  హైదరాబాద్: నగరంలోని హాస్టళ్లలో ఉన్న విద్యార్థులెవరూ సొంత ఊళ్లకు వెళ్లొద్దని, అలాగే పోలీసులు ఎవరికీ ఎన్‌ఒసిలు ఇవ్వొద్దని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ సూచించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఎన్‌ఒసిలు పూర్తిగా నిలిపివేశామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజలందరూ లాక్ డౌన్‌లో స్వచ్ఛంధంగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. హాస్టళ్ల నిర్వాహకులకు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. హాస్టళ్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు […] The post పోలీసులు ఎన్‌ఒసిలు ఇవ్వొద్దు: హోంమంత్రి మహమూద్ ఆలీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నగరంలోని హాస్టళ్లలో ఉన్న విద్యార్థులెవరూ సొంత ఊళ్లకు వెళ్లొద్దని, అలాగే పోలీసులు ఎవరికీ ఎన్‌ఒసిలు ఇవ్వొద్దని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ సూచించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఎన్‌ఒసిలు పూర్తిగా నిలిపివేశామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజలందరూ లాక్ డౌన్‌లో స్వచ్ఛంధంగా పాల్గొంటున్నారని ఆయన అన్నారు. హాస్టళ్ల నిర్వాహకులకు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. హాస్టళ్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహమూద్‌అలీ హెచ్చరించారు.

కర్నాటక ముఖ్యమంత్రి ఉగాది సందర్భంగా విద్యార్థులు హాస్టల్స్ నుంచి ఊళ్లకు వెళ్ళమని చెప్పారని, అదే తరహాలో తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎన్‌ఒసిల కోసం వచ్చారని మహమూద్‌అలీ చెప్పారు.కొంతమంది విద్యార్థులకు ఎన్‌ఒసిలు ఇచ్చామన్నారు. తర్వాత నిలిపివేశామని చెప్పారు.లాక్ డౌన్ సందర్భంగా అధిక రేట్లతో ప్రజలను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ప్రజలందరు పోలీసులకు సహకరించాలని,కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు.

Do not give police NOCs to Students say Mahmood Ali

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పోలీసులు ఎన్‌ఒసిలు ఇవ్వొద్దు: హోంమంత్రి మహమూద్ ఆలీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: