రవిప్రకాశ్‌కు బెయిలివ్వొద్దు

హైదరాబాద్: టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌పై కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా కేసులు నమోదు చేశారని, ఆయన తరఫు న్యాయవాది వాదించగా, రవి ప్రకాష్ ఫోర్జరీకి పాల్పడ్డారని, ఆయనకు ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దంటూ పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈక్రమంలో రవిప్రకాశ్ తరపున దిల్ ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసును ఈనెల 18వ తేదీకి (వచ్చే మంగళవారం) వాయిదా వేసింది. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హారెన్ రావెల్ టివి9 రవి ప్రకాష్ […] The post రవిప్రకాశ్‌కు బెయిలివ్వొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌పై కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా కేసులు నమోదు చేశారని, ఆయన తరఫు న్యాయవాది వాదించగా, రవి ప్రకాష్ ఫోర్జరీకి పాల్పడ్డారని, ఆయనకు ఎట్టిపరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దంటూ పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఈక్రమంలో రవిప్రకాశ్ తరపున దిల్ ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసును ఈనెల 18వ తేదీకి (వచ్చే మంగళవారం) వాయిదా వేసింది.

పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హారెన్ రావెల్ టివి9 రవి ప్రకాష్ ఫోర్జరీకి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఫోర్జరీ పత్రాలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా 160 సిఆర్‌పిసి , 41ఏ నోటీసులు ఇచ్చిన కాపీలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా మొబైల్‌లో రవిప్రకాష్ జరిపిన సంభాషణల స్క్రీన్ షాట్స్‌ను కూడా కోర్టు ముందుంచారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తిరుగుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారని కోర్టుకు వివరించారు. రవిప్రకాశ్ రూ.90 నుంచి రూ.100 కోట్ల విలువ చేసే టివి 9 లోగోను రూ.99 వేలకే ఎలా విక్రయించాని ప్రశ్నిస్తే తాను టివి9 కంపెనీకి యజమానిని పేర్కొంటున్నారని కోర్టుకు లాయర్ తెలిపారు. ముఖ్యంగా టివి9లో కేవలం 9 శాతం వాటా ఉన్న వాళ్లు ఎలా యజమాని అవుతారని న్యాయవాది ప్రశ్నించారు.

అదే సంస్థలో 90శాతం వాటా ఉన్నవారి పరిస్థితేంటన్నారు. ఫోర్జరి, కుట్ర, నిధుల మళ్లింపు, డేటాచోరి కేసుల విషయంలో రవిప్రకాశ్‌ను దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. రవి ప్రకాష్ బయట ఉంటే తప్పకుండా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయొద్దని హైకోర్టు ధర్మాసనానికి పోలీసుల తరఫు సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హారెన్ రావెల్ విన్నవించారు. కాగా కౌంటర్‌గా రవి ప్రకాష్ తరఫు న్యాయవాది దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా తన క్లైంట్ ఫోన్ సంభాషణలకు సంబంధించి స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింట్ మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటాను స్క్రీన్ షాట్స్ ఎలా తెస్తారని ప్రశ్నలు సంధించారు.

పోలీసులు కావాలనే లోగో వ్యవహారాన్ని తెరమీదకు తెస్తున్నారని అన్నారు. టివి9 లోగో సృష్టికర్త రవి ప్రకాష్ అని, కాపీ రైట్ చట్టం సెక్షన్ 70 ప్రకారం లోగోపై పూర్తి హక్కు అతనికే ఉంటుందని వాదించారు. 2003 నుంచి టివి 9 కంపెనీ వ్యవస్థాపకుడిగా రవి ప్రకాష్ వ్యవహరిస్తూ వచ్చారని, సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం మంచిదికాదన్నారు. తన క్లైంట్ రవి ప్రకాష్‌కు బెయిల్ ఇస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని, బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా కోరడంతో ఏ ప్రాతిపదికన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో కోర్టులో సమయం దాటిపోవడంతో విచారణను ఈనెల 18వ తేదీ నాటికి వాయిదా వేశారు.

Do Not Get Bail to Ravi Prakash

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రవిప్రకాశ్‌కు బెయిలివ్వొద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: