ఇళ్లల్లోనే పూజలు చేసుకోండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ : కరోనా విజృంభిస్తున్నందున జులై 1న తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రావొద్దని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఆ రోజు ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పోలీసు లైన్ ఉన్నత పాఠశాలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి […] The post ఇళ్లల్లోనే పూజలు చేసుకోండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్ నగర్ : కరోనా విజృంభిస్తున్నందున జులై 1న తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రావొద్దని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఆ రోజు ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పోలీసు లైన్ ఉన్నత పాఠశాలో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తొలి ఏకాదశి సందర్భంగా జులై 1న మన్యంకొండ ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అయితే భక్తులు ఈ ఆలయానికి రాకుండా తమతమ ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా ఉధృతి పెరుగుతున్నందున ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, బయటికి వచ్చినప్పుడు భౌతికదూరం పాటించాలని, విధిగా మాస్క్ లు ధరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పిన నిబంధనలను పాటిస్తూ, ప్రభుత్వానికి ప్రజలు సహకరించినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని ఆయన వెల్లడించారు.

 

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఇళ్లల్లోనే పూజలు చేసుకోండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: