ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్ : డికె అరుణ

మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, కనీసం ప్రత్యామ్నాయ పార్టీగా కూడా ఎదిగే పరిస్ధితి లేదని మాజీ మంత్రి, మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్ధి డికె అరుణ విమర్శించారు. శనివారం ఆమె బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గతంలో టిఆర్‌ఎస్‌ను గెలిపించి కాంగ్రెస్‌కు ప్రతిపక్షం హోదా ప్రజలు ఇచ్చినప్పటికీ ప్రజాదరణ పొందలేక పోయిందని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరిగి కాంగ్రెస్ బలమైనటువంటి […]

మహబూబ్ నగర్ : కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, కనీసం ప్రత్యామ్నాయ పార్టీగా కూడా ఎదిగే పరిస్ధితి లేదని మాజీ మంత్రి, మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్ధి డికె అరుణ విమర్శించారు. శనివారం ఆమె బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గతంలో టిఆర్‌ఎస్‌ను గెలిపించి కాంగ్రెస్‌కు ప్రతిపక్షం హోదా ప్రజలు ఇచ్చినప్పటికీ ప్రజాదరణ పొందలేక పోయిందని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరిగి కాంగ్రెస్ బలమైనటువంటి ప్రతిపక్షంగా ఎదగలేక పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటుందని ప్రజలు బలంగా నమ్మినప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతల కారణంగా ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.  సీనియర్ నేతలుగా ఉన్న కాంగ్రెస్ నేతలు కొందరు తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు నీళ్లు వదిలేశారన్నారు. ఇంకా కొందరు టిఆర్‌ఎస్‌లోకి కొందరు సీనియర్ వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అస్తవ్యస్తంగా చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, దేశ రక్షణ కోసం జాతీయ పార్టీగా ఉన్న బిజెపిలో చేరినట్లు డికె అరుణ చెప్పారు. దేశ ప్రజలకు ప్రత్యామ్నాయంగా బిజెపి ఉంటుందని నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు. పొరుగు దేశాన్ని ఎదుర్కొనే సత్తా బిజెపికే ఉందన్నారు. ఇటీవల చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ వంటి చర్యలతో దేశ రక్షణకు బిజెపి పాటు పడిందన్నారు. దేశ ప్రజల్ని రక్షంచే వారే దేశ ప్రదానిగా ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అరుణ చెప్పారు. దేశ వ్యాప్తగా కాంగ్రెస్ నేత రాహుల్, మోడీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని ఆమె తెలిపారు.  దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నందుకే బిజెపిలోకి చేరానని ఆమె పేర్కొన్నారు. పదవి కోసమే అయితే టిఆర్‌ఎస్‌లోకి వేళ్లదానినని , తానెప్పుడు రాజకీయాలలో ఉన్నా, అన్ని ప్రాంతాల ప్రజల కోసం, పాలమూరు జిల్లా కరువు నివారణ, వలసల నివారణకు కోసం పని చేశానన్నారు. పాలమూరు ఆడబిడ్డగా తాను సేవ చేస్తానని చెప్పారు.  కేంద్ర మాజి మంత్రి జైపాల్ రెడ్డి తనపై కుట్రతోనే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాన్ని నాగర్‌కర్నూలు పార్లమెంట్‌లో కలిపారని అరుణ ఆరోపించారు.  తాను పోటీ అవుతానని భయంతోనే జైపాల్ రెడ్డి వాటిని వేరు పర్చారని చెప్పారు. కేంద్రమంత్రిగా పని చేసిన ఆయన పాలమూరుకు ఏ విధమైన అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో తమ కంటే జైపాల్ రెడ్డి జూనియర్ అని విమర్శించారు. అటు తన నాన్న నుంచి కాని, ఇటు తన మామ వారి కుటుంబం నుంచి కూడా తమ కుటుంబాలే రాజకీయాలలో ముందునుంచి ఉన్నాయని గుర్తు చేశారు. అ నాటి నుంచి ఈ నాటి వరకు ప్రజా సేవలో ముందు ఉన్నామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను కాపాడే శక్తి రాష్ట్ర కాంగ్రెస్‌కు లేదని అమె చెప్పారు. ఈ విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి ,కొండన్న తదితరులు పాల్గొన్నారు.

DK Aruna Comments on Congress

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: