టైటిల్ వేటకు జకోవిచ్…

  లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో జకోవిచ్ 62, 46, 63, 62తో తేడాతో స్పెయిన్ ఆటగాడు రాబెట్టా అగట్‌ను ఓడించాడు. నాలుగు సెట్ల సమరంలో జకోవిచ్ అద్భుత ఆటతో విజయాన్ని అందుకున్నాడు. ప్రారంభం నుంచే జకోవిచ్ ఆధిపత్యం చెలాయించాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. జకోవిచ్ చూడచక్కని షాట్లతో […] The post టైటిల్ వేటకు జకోవిచ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్: ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో జకోవిచ్ 62, 46, 63, 62తో తేడాతో స్పెయిన్ ఆటగాడు రాబెట్టా అగట్‌ను ఓడించాడు. నాలుగు సెట్ల సమరంలో జకోవిచ్ అద్భుత ఆటతో విజయాన్ని అందుకున్నాడు. ప్రారంభం నుంచే జకోవిచ్ ఆధిపత్యం చెలాయించాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకు పడ్డాడు. జకోవిచ్ చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టాడు.

జకోవిచ్ ధాటికి అగట్ తొలి సెట్‌లో కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన జకోవిచ్ ఏమాత్రం కష్ట పడకుండానే సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ, రెండో సెట్‌లో జకోవిచ్‌కు చుక్కెదురైంది. ఈసారి స్పెయిన్ స్టార్ అగట్ ఆధిపత్యం చెలాయించాడు. జకోవిచ్ జోరును అడ్డుకుంటూ ముందుకు సాగాడు. చక్కని షాట్లతో జకోవిచ్‌ను హడలెత్తించాడు. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ, కీలకమైన మూడో సెట్‌లో జకోవిచ్ మళ్లీ పుంజుకున్నాడు. అగట్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తన మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు.

జకోవిచ్ దూకుడు ముందు అగట్ తేలి పోయాడు. కనీస పోటీ కూడా ఇవ్వకుండానే అగట్ సెట్‌ను కోల్పోయాడు. నాలుగో సెట్‌లో జకోవిచ్ మరింత విజృంభించాడు. దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు సాగాడు. అగట్‌కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా లక్షంగా వైపు నడిచాడు. చివరి వరకు ఆధిపత్యం చెలాయిస్తూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. జకోవిచ్ కిందటిసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు. వరుసగా రెండో ఏడాది కూడా టైటిల్ పోరుకు దూసుకొచ్చాడు. మరోవైపు సెమీస్ చేరుకునే క్రమంలో స్టార్ ఆటగాళ్లను ఓడించిన అగట్ సెర్బియా యోధుడికి మాత్రం తలవంచక తప్పలేదు.

Djokovic at the Wimbledon title fight

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టైటిల్ వేటకు జకోవిచ్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: