స్ట్రాంగ్ రూంలను తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి

  కరీంనగర్: ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల స్ట్రాంగ్ రూంలను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏప్రిల్ 11న జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధిచిన ఈవిఎంలను కౌంటింగ్ కేంద్రం అయిన ఎస్ఆర్ఆర్ కాలేజీలో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరిచినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు మూడు అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, అన్ని స్ట్రాంగ్ రూంల […] The post స్ట్రాంగ్ రూంలను తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్: ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల స్ట్రాంగ్ రూంలను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏప్రిల్ 11న జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధిచిన ఈవిఎంలను కౌంటింగ్ కేంద్రం అయిన ఎస్ఆర్ఆర్ కాలేజీలో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరిచినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు మూడు అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, అన్ని స్ట్రాంగ్ రూంల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో గల 7 స్ట్రాంగ్ రూంలను తనిఖీ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, ఆర్‌డిఓ ఆనంద్‌కుమార్ స్ట్రాంగ్ రూం ఇంచార్జి జయశంకర్, తహశీల్దార్ కనకయ్య పాల్గొన్నారు.

District Election Officer checked for strong rooms

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్ట్రాంగ్ రూంలను తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: