రేషన్ దుకాణాల్లో ఐరిస్ ద్వారా సరుకులు

Ration shops

 

హైదరాబాద్ : మహానగరంలో రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే సమస్యలను అధిగమించేందుకు జిల్లా పౌరసరఫరా అధికారులు ఐరిష్ విధానం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారా ప్రతినెలా రేషన్ తీసుకునే సమయంలో వృద్దులు,గృహిణులు, కూలీ పనులు చేసుకునేవారి వేలిముద్రలు మ్యాచ్ కావడం లేదు. దీంతో కార్డులు ఇబ్బందులు ఎదుర్కొంటూ రేషన్ సరుకులు తీసుకోవాలంటే వెనకడుగు వేస్తునట్లు, వారి వేలిముద్రలు అరిగిపోవడమే కారణమని డీలర్లు పేర్కొంటున్నారు. పలుమార్లు ఈసమస్యపై ఉన్నతాధికారులకు, స్దానిక రాజకీయ నాయకులకు ఫిర్యాదులు చేసిన ఈవిధానం తీసివేసి మరో విధానం ప్రవేశపెట్టాలని కోరారు. స్పందించిన అధికారులు ఐరిస్ అమలు చేయాలని మొదట్లో భావించిన దీని పూర్తి స్దాయిలో అమలు చేయాలంటే చాలా సమయం పడుతుందని, దీంతో రేషన్‌సరుకుల పంపిణీ ఆలస్యమైతుందని వెనకడుగు వేశారు.

కానీ బయోమెట్రిక్‌తో సమస్యలు రోజురోజుకు పెరగడంతో ఐరిస్ విధానం త్వరగా అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్ నగరం తప్ప జిల్లాలో ఐరిస్ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానం విజయవంతం కావడంతో మహానగరంలో ప్రవేశపెట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. బయోమెట్రిక్ విధానం ప్రారంభించినప్పటి నుంచి సమస్యలు వస్తున్నాయి. కొందరు లబ్దిదారులు మాత్రం వేలిముద్రలు తీసుకునేందుకు ఆధార్‌కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. చిన్నపిల్లల విషయంలో బయోమెట్రిక్ పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ఈబయోమెట్రిక్ విధానంతో రేషన్ డీలర్లు సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. ఒక రైస్‌కు వేలిముద్రలు తీసుకుని మిగతా సరుకులు మొత్తం తీసుకున్నట్లు రికార్డులో చూపిస్తూ వాటిని నల్లబజారుకు తరలిస్తున్నట్లు అధికారులు తనిఖీలో పలుమార్లు బయటపడ్డాయి.

రేషన్ సరుకులు తీసుకున్న వెంటనే ప్రతికార్డుదారునికి వెంటనే సెల్‌పోన్‌కు సమాచారం రావాలి కానీ ఇప్పటివరకు దాని అమలు చేయకుండా డీలర్లు తప్పించుకుంటున్నారు. గ్రేటర్ నగర పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 12 సర్కిళ్లు,1545 రేషన్‌దుకాణాలున్నాయి. 16,02,134 కుటుంబాలకు ఆహారభద్రత కార్డులు కలిగి ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 5,85,039 కార్డులు,21,85,668 యూనిట్లు ఉన్నాయి. రంగారెడ్డి 5,23,,089 ఉండగా, 17,46,078 యూనిట్లు, మేడ్చల్ జిల్లాలో 4,94,116 కార్డులు ఉండగా, 16,47,265 యూనిట్లు ఉన్నట్లు సివిల్ సప్లయి అధికారులు చెప్పారు. బయోమెట్రిక్ విధానంతో రేషన్‌సరుకులు ఇస్తున్నారు.

వీరిలో సగానికిపైగా కార్డుదారులు నెలవారీగా రేషన్ తీసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఒక్కొక్కసారి వేలిముద్రలు మ్యాచ్‌కావడానికి రేషన్‌దుకాణం వద్ద రెండుమూడుగంటల పాటు వేచిచూడాల్సి పరిస్దితి వచ్చిందని,దీనికి తోడు ఆన్‌లైన్‌విధానం కావడంతో సిగ్నల్ వ్యవస్ద సరిగ్గాలేదని మరో గంటపాటు ఉండాల్సి వచ్చేందని పలువురు లబ్దిదారులు పేర్కొంటున్నారు. వేలిముద్రలు కాకుండా ఐరిస్‌విధానం తీసుకొచ్చి బయోమెట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలిగించాలని సూచిస్తున్నారు.

Distribution of goods by iris in Ration shops

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రేషన్ దుకాణాల్లో ఐరిస్ ద్వారా సరుకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.