ఉద్యమ కెసిఆర్ మానసపుత్రిక బతుకమ్మ చీర

  నేతన్నల జీవితంలో వెలుగుల కోసమే బతుకమ్మ చీరెల పంపిణీ రాబోయే రోజుల్లో డ్రెస్ కోడ్ ఉన్న శాఖలన్నింటిల్లో చేనేత వస్త్రాలే.. బతుకమ్మ చీరెల పంపిణీకి నల్లగొండలో శ్రీకారం చుట్టిన మంత్రి కెటిఆర్ నల్లగొండ : ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమనేతగా పర్యటిస్తున్న సందర్బంలో నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మదిలో పుట్టినదే బతుకమ్మ చీర పథకమని మున్సిపల్, ఐటి, జౌళిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2001లో నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని […] The post ఉద్యమ కెసిఆర్ మానసపుత్రిక బతుకమ్మ చీర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేతన్నల జీవితంలో వెలుగుల కోసమే బతుకమ్మ చీరెల పంపిణీ
రాబోయే రోజుల్లో డ్రెస్ కోడ్ ఉన్న శాఖలన్నింటిల్లో చేనేత వస్త్రాలే..
బతుకమ్మ చీరెల పంపిణీకి నల్లగొండలో శ్రీకారం చుట్టిన మంత్రి కెటిఆర్

నల్లగొండ : ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమనేతగా పర్యటిస్తున్న సందర్బంలో నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మదిలో పుట్టినదే బతుకమ్మ చీర పథకమని మున్సిపల్, ఐటి, జౌళిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2001లో నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్‌పోచంపల్లిలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే వారి కోసం జోలె పట్టి మరీ భిక్షాటన చేస్తున్న క్రమంలో కెసిఆర్ మదిలో నుంచి నేతన్నలకు ప్రభుత్వమే భరోసా కల్పించాలని, ఆ మేరకు అప్పట్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో కూడా నేతన్నల ఆత్మహత్యలకు చలించిన కెసిఆర్ నాడు పార్టీ తరపునే ఆదుకోగా, నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నాడని కొనియాడారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్రవ్యాప్త బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో కోటి చీరల పంపిణి కార్యక్రమం నల్లగొండ నుండి ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ మహిళామణులకు మాత్రమే పరిమితమైన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక పెద్దన్నలాగా, ఆప్తుని మాదిరిగా మహిళలకు అందరికి అందిస్తున్న చిన్న కానుక బతుకమ్మ చీరల పంపిణి అని వివరించారు. చీరల పంపిణికి రెండు ముఖ్యకార్యణాలుండగా నల్లగొండ జిల్లా పోచంపల్లి, కరీంనగర్ జిల్లాలలో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యమ నాయకునిగా నేత కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించారని, అందులో భాగంగానే మహిళలకు బతుకమ్మ చీరలు, బడిపిల్లల దుస్తులు, కేసిఆర్ కిట్ ద్వారా ఆసుపత్రుల్లో అందిస్తున్న నేత వస్త్రాలు స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి నేతన్నలకు భరోసా కల్పించిందని గుర్తుచేశారు.

నేత కార్మికులను ఆదుకునేందుకు త్రిప్ట్ సోసిటిలతో పాటు చేనేత, టెక్స్‌టైల పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించి అందరూ నేత వస్త్రాలు ధరించే విధంగా గడిచిన ఐదేళ్ళుగా పోత్సాహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నల్లగొండ జిల్లాపై అమితమైన ప్రేమ ఉన్నదని అందుకే కేసిఆర్ నల్లగొండ, సూర్యాపేటలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేశారని, మల్కాపూర్ ప్రాంతంలో త్వరలో అతిపెద్ద పార్క్ ఏర్పాటుచేయనున్నామని దీని ద్వారా సుమారు 11వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ప్రభుత్వ చర్యలు కారణంగా నేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు తగ్గాయని గుర్తు చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకపోతే, కెసిఆర్ సీఎం కాకపోతే ఇలాంటి అభివృద్ది సాధ్యం అయ్యేదా అన్న అనుమానాలు ఇప్పుడు కల్గుతున్నాయన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది దేశానికే మార్గదర్శకంగా ఉన్నదని, ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశానికే దిశానిర్దేశం చేసే విధంగా తెలంగాణలో పాలన సాగుతున్నదని ఇలాంటి ప్రభుత్వానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ చీరెల పంపిణి కార్యక్రమం ఎవరూ అడగకపోయినా చేపట్టామని, ఈ ఆలోచన నల్లగొండ నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు.

మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందించాలనే ఆలోచన కూడా నల్లగొండ జిల్లాలోనే ప్రారంభం అయ్యిందని, బతుకమ్మ చీరల పంపిణి భూదాన్‌పోచంపల్లి గ్రామంలో పురుడు పోసుకున్నదని కెసిఆర్ ఉద్యమ నాయకునిగా గ్రామ గ్రామాన పర్యటించి, నిద్రచేసినప్పుడు చేనేత కార్మికుల సమస్యలు స్వయంగా తెలుసుకొని వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. పోచంపల్లి, సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వమే వారి ఉత్పాదనలు, మాఫీలు చేస్తూనే తెలంగాణ పండుగల సందర్భంగా వస్త్రాల పంపిణికి శ్రీకారం చుట్టి చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచి చేనేతకు మళ్లి జీవంపోసిందన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన సదర్బంలో ప్లోరైడ్ పీడిత ప్రాంతాలను చూసి చలించిన ఉద్యమ నేతగా కెసిఆర్ భగీరథ పథకంతో సురక్షిత మంచినీటిని అందించే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ లో పైలాన్ నిర్మాణం చేసి ఇంటింటికి నీటిని అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజల బాధలు తెలిసిన తండ్రి, కొడుకులు నిత్యం తెలంగాణ అభివృద్ది కోసం కృషిచేస్తున్న క్రమంలో ఇంత చక్కటి కార్యక్రమం నల్లగొండ నుండే ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు. కళ్యాణలక్ష్మి ఎవరు అడిగింది కాదని, హాస్టల్స్‌లో సన్నబియ్యం ఎన్నికల కోసం చేపట్టింది కాదన్నారు.

అభివృద్ది, సంక్షేమ కోసం అమలు చేస్తున్న ప్రభుత్వం తమదన్నారు. అనంతరం మహిళలకు చీరెలు పంపిణీ చేయడంతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నల్లగొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు నల్లబోతు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, జౌళిశాఖ కమీషనర్ శైలజారామయ్యార్, కలెక్టర్ గౌవర్ ఉప్పల్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

పదికాలాల పాటు సల్లగా ఉండాలి
జెర్రిపోతుల అశ్వీని, ఆర్జాలబావి
నాటి తెలంగాణ ఉద్యమనేత, నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరల పంపకం పథకాన్ని మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టి మహిళల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. కుటుంబంలోనే ఒక దేవునిగా మాదిరిగా మేము ఆరాదిస్తున్నాము. నిండు నూరేళ్లు అయురారోగ్యాలతో ఉండి పదికాలాల పాటు సల్లగా ఉండాలని కోరుకుంటున్నాము.

ఆడపడుచులకు అన్న సిఎం కెసిఆర్
కొమ్ము పద్మజ, శ్రీరాంనగర్
ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలు ఎంతో చూడచక్కగా ఉన్నాయి. లెక్కకు లేనన్ని రంగుల్లో తీరొక్క చీరను అందించడం ఎంతో సంతోషంగా ఉంది. పుట్టింటికి వెళ్లినప్పుడు ఆడపడుచులకు తల్లిదండ్రులు లేదంటే అన్నదమ్ములు చీరలు పెట్టి కట్టించినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఇప్పుడు కూడా అంతటి ఆనందాన్ని గుండెల్లో దాచుకొని వెళ్తున్నాము. ఆయనే కెసిఆర్ సొంత అన్న లేకపోయిన మహిళల్లో అన్న ఉన్నంత దైర్యం ఉంది.

Distribution of Bathukamma sarees

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉద్యమ కెసిఆర్ మానసపుత్రిక బతుకమ్మ చీర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: