కృష్ణా నదిలోకి చేరిన దిశా అస్థికలు..

మహబూబ్‌నగర్: షాద్ నగర్ లో దారుణ హత్యకు గురైన దిశా అస్థికలు కృష్ణా నదిలోకి చేరాయి. జోగులాంబ గద్వాల అలంపూర్ తాలుక ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద కృష్ణా నదిలో జస్టిస్ ఫర్ దిశ(ప్రియాంకరెడ్డి) అస్థికలను సోమవారం తండ్రి, కుటుంబ సభ్యులు కలిపారు. సాంప్రదాయ పరంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుమార్తె అస్తికలను కృష్ణా నదిలో కలిపారు. రెండు, మూడు రోజుల్లో దిశతో కలిపి అమ్మవారిని దర్శించుకుందామని అనుకున్నామని, కానీ ఇక్కడే ఆస్థికలను కలపాల్సి వస్తుందని అనుకోలేదని ఆమె తండ్రి కన్నీరు పెట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరాడు.

Disha Ashes immersed in Krishna River 

 

The post కృష్ణా నదిలోకి చేరిన దిశా అస్థికలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.