మత్తులో ఏదో ఒకటి చేయాలని..: దిశ నిందితులు

 

హైదరాబాద్:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతంలో రిమాండ్‌పై చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులు బయటపెట్టిన వాస్తవాలు విని పోలీసులు అవాక్కయ్యారు. ఆ రోజు ఫుల్లుగా మందు కొట్టి లారీలో ఖాళీగా కూర్చోవడంతో విసుగు పుట్టిందని, ఆ సమయంలో యువతి ఒంటరిగా కనిపించడంతో ఏదో ఒకటి చేయాలనుకున్నామని నిందితులు తెలిపారు.

యువతి సాయంత్రం స్కూటీ పార్కింగ్ చేసి వెళ్లడాన్ని గమనించామని, ఆమె ఎంత ఆలస్యంగా వస్తే.. పని అంత ఈజీ అవుతుందని భావించినట్టు తెలిపారు. అనుకున్నట్టుగానే బాధితురాలు రాత్రి 9 గంటల తర్వాత వచ్చిందని, ఈ లోపు స్కూటీ టైర్ లో గాలి తీసి ఆమెను ట్రాప్ చేశామని.. ఆ తర్వాత ఆమెను రేప్ చేసిన అక్కడి నుంచి పారిపోవాలని మందు తాగుతూ నిర్ణయించుకున్నామని నిందితులు వెల్లడించారు. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను చంపేసి దహనం చేస్తే పోలీసులకు దొరకకుండా తప్పించుకోవచ్చని భావించామని, అందుకే ఇలా చేశామని.. కానీ, ఇంత పెద్దది అవుతుందని అనుకోలేదని నిందితులు చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు.

Disha accused reveal stunning details

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మత్తులో ఏదో ఒకటి చేయాలని..: దిశ నిందితులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.