నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్…

  కాళేశ్వరానికి దక్కని జాతీయ హోదా, నిధులు వరంగల్‌కు దక్కని నిధులు వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి పెరగని కనీస ఆదాయ స్లాబ్ నియంత్రణలేని పెట్రోలు, డీజిల్ ధరలు వరంగల్ : కేంద్రంలో రెండోసారి కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను నిరాశపర్చింది. సామాన్యునికి అందుబాటులో మౌళిక సదుపాయాల కల్పన, సంక్షేమం, అభివద్ధికి పెద్దపీఠ వేస్తుందనుకుంటే పాత సీసాలో కొత్త సారా పోసిన చందంగా ఉందని మెజార్టీ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో […] The post నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కాళేశ్వరానికి దక్కని జాతీయ హోదా, నిధులు
వరంగల్‌కు దక్కని నిధులు
వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి
పెరగని కనీస ఆదాయ స్లాబ్
నియంత్రణలేని పెట్రోలు, డీజిల్ ధరలు

వరంగల్ : కేంద్రంలో రెండోసారి కొలువు దీరిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను నిరాశపర్చింది. సామాన్యునికి అందుబాటులో మౌళిక సదుపాయాల కల్పన, సంక్షేమం, అభివద్ధికి పెద్దపీఠ వేస్తుందనుకుంటే పాత సీసాలో కొత్త సారా పోసిన చందంగా ఉందని మెజార్టీ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో మొదటి సారిగా మహిళకు ఆర్థిక శాఖను అప్పగించడం బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలాసీతారామన్ ప్రసంగించిన తీరు మహిళా లోకానికి ఆదర్శంగా మారింది.

మొత్తం బడ్జెట్‌పై ప్రజలు వ్యతిరేకంగా ఉండగా మంత్రి నిర్మలా సీతారామన్‌కు దక్కిన అవకాశానికి అన్ని వర్గాలు మార్కులు వేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎలాంటి కేటాయింపులు జరుగలేదు. గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల తరపున పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా ప్రచారం నిర్వహించి కేంద్ర స్థాయి సంస్థలు రైల్వే వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ లాంటి వాటిని నిర్మించడానికి హామీలు ఇచ్చారు. భయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కూడా ఊసే రాలేదు. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులు లేక కోతలే మిగలడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు.

ఇక మిగిలింది సామాన్యులకు నిత్యవసర వాహనాల్లో పోయాల్సిన ఇంధనానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై నియంత్రణ లేకుండా చేసింది. పెట్రోలు, డీజిల్‌పై ఒక్క రూపాయి పెంచుతున్నట్లు బడ్జెట్‌లో పేర్కొనడం పెట్రో రంగానికి అడ్డులేకుండా పోయినట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇకపోతే వ్యవసాయ రంగలంలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఈ బడ్జెట్ తీరని నిరాశను కల్గించింది. పత్తి, పసుపు, మిర్చి లాంటి వాణిజ్య పంటలను సాగుచేసే రైతులకు కనీస గ్యారంటీ లేని బడ్జెట్ వచ్చినట్లుగా రైతులు పేర్కొంటున్నారు.

ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడం, వచ్చి దిగుబడిని కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం అరకొర ధరతో కొనుగోలు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. దీనిపై స్పష్టమైన మద్దతు ధర కేంద్రం నుంచి రాకపోవడం మరో బడ్జెట్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్యుని ఆదాయ స్లాబ్‌లో పాత పద్ధతినే అనుసరించారు. రూ. ఐదు లక్షల పైబడిన సంవత్సర ఆదాయంపై ఆదాయ పన్ను తప్పదన్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడంపై కూడా సామాన్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు రూ. కోటికి పైగా టర్నోవర్ చేస్తే రెండు శాతం టీడీఎస్ కటింగ్ ఉంటుందన్న దానిపై బ్లాక్ మార్కెటింగ్ దందాకు బారులు తెరిచినట్లుగానే అవుతుందని వ్యాపారులు వాపోతున్నారు. ఒకే పన్ను ఒకే దేశం అనే నినాదంతో ముందుకు పోతున్న బీజేపీ ప్రభుత్వం పన్నుల అమలులో వ్యాపారుల నడ్డి విరుస్తుందన్నారు.

కాళేశ్వరానికి దక్కని జాతీయ హోదా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ జీవధారగా రూపు దిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో జాతీయ హోదాను ప్రకటించకపోవడం పై అన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజనలో చేసుకున్న ఒప్పందాలు ఈ బడ్జెట్‌లో ఒక్కటి కూడా ప్రస్తావనకు తీసుకరాకపోవడం నిరాశను మిగిల్చినట్లయింది. రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాల్లో మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచినప్పటికీ ఆ పథకానికి కేంద్రం నుంచి కేటాయింపులు ఇందులో కనిపించలేదు.

కేంద్ర ప్రభుత్వానికి అనుకూల అంశాలు

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో రైతులకు ఏటా రూ. ఆరు వేల నగదు సాయం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం, ప్రధాని గ్రామ సడక్ యోజన, గ్రామ అగ్ర వర్ణ పేదలకు 1-0 శాతం రిజర్వేషన్ అమలు, విద్యుత్ వాహనాలకు ధర తగ్గించడం, గోరక్షణ కోసం చర్యలు తీసుకోవడం, కనీస పింఛన్ రూ. మూడు వేలు, రుణాలు సకాలంలో చెల్లించన వారికి రాయితీలు, ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన వారికి రుణాల రీషెడ్యూల్, అంగన్‌వాడీ టీచర్ల జీతం 40 శాతం పెంపు లాంటికి ఉన్నాయి.

Disappointed Central Budget

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: