మరో భారీ ఈవెంట్ కు జక్కన్న ప్లాన్..?

Director SS Rajamouli దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తికేయ, హీరో జగపతిబాబు అన్న కుమార్తె పూజల వివాహం జైపూర్‌లో ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. సంగీత్ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ చేసిన డ్యాన్సులతో పెళ్లి వేడుక అదిరిపోయింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రానా, అనుష్కలు హుషారుగా స్టెప్పులు వేసి అలరించారు. వీరికి తోడుగా రాజమౌళి, కీరవాణి సైతం చిందులు వేసి ఆకట్టుకున్నారు. ఈ వివాహ వేడుకలో స్టార్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.

అయితే పెళ్లికి అందరిని పిలవడం కుదరలేదని జక్కన్న మరో ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులందరూ హాజరయ్యేలా హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాజమౌళి సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ఫంక్షన్ కి సెలబ్రెటీలతో పాటు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ఇన్విటేషన్స్ రెడీ చేస్తున్నారట జక్కన్న. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజమౌళి ఫ్యామిలిలో ఒక వేడుక ఘనంగా జరుగుతోంది.

ఇక తనదైన సినిమాలతో ప్రత్యేక ముద్ర వేసుకున్న రాజమౌళి ఇలా కొడుకు పెళ్లి ఈవెంట్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జక్కన్నతాజాగా భారీ మల్టీస్టారర్ తో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోలుగా చేస్తున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్(వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో మరోసారి రాజమౌళి తెలుగు ప్రేక్షకులకు ఫీస్ట్ ఇవ్వనున్నారు.

Director SS Rajamouli plans for another Big Event?