విసిగించేవారిపైనే ఆయన చేయి చేసుకుంటారు…

Director Puri Jagannadhహైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన  ‘ఇస్మార్ట్ శంకర్’కి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా విజయం సాధించడంతో పూరీ జగన్నాథ్ పుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో పూరీ ప్రముఖ హీరో బాలకృష్ణ గురించి ప్రస్తావించారు. తాను చాలా మంది హీరోలతో పని చేశానని, వారందరితో చనువుగానే ఉంటానని, అయితే బాలకృష్ణతో మరింత సన్నిహితంగా ఉంటానని పూరీ పేర్కొన్నారు. బాలకృష్ణ దర్శకులకు విలువ ఇస్తారని, తాను ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడి ఉంటారని పూరీ వెల్లడించారు. ఈ క్రమంలోనే తనకు బాలకృష్ణ అంటే ఎక్కువ ఇష్టమని పూరీ చెప్పుకొచ్చారు.  ‘పైసా వసూల్’ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఆయనతో తన అనుబంధం మంచిగానే కొనసాగుతూనే వుందని, ఆయన చెప్పారు. అభిమానులపై బాలకృష్ణ చేయి చేసుకుంటారనే విమర్శ ఉన్న విషయం తెలిసిందే. దీనిపై పూరీ స్పందించారు. అభిమానుల పేరుతో మీద పడిపోయి విసిగించే వారిపై మాత్రమే బాలకృష్ణ చేయి చేసుకుంటారని,  బాలకృష్ణ గురించి తనకు పూర్తిగా తెలుసునని, ఆయన చాలా మంచి వ్యక్తి అని పూరీ కొనియాడారు.

Director Puri Jagannadh Comments On Hero Balakrishna

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విసిగించేవారిపైనే ఆయన చేయి చేసుకుంటారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.